Dalita Bandhu scheme benefits will be given to govt employees in dalits: హుజూరాబాద్: దళిత బంధు పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళితులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నేడు హుజురాబాద్‌లోని శాలపల్లిలో నిర్వహించిన దళిత బంధు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బంధు పథకం తరహాలోనే దళిత బంధు పథకం కూడా దళితులకు అందరికీ అందిస్తామని అన్నారు. దళిత బంధు పథకంతో (Dalita Bandhu) దళితులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతూ.. ఈ పథకం ఓ కొత్త చరిత్ర సృష్టిస్తుంది అని ఆశాభావం వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus pandemic) కారణంగా ఈ పథకాన్ని ఏడాది ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ఇలా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఆలోచించలేదని, అందుకే ఇది ఒక చరిత్ర సృష్టించే పథకం అవుతుంది అని అభిప్రాయపడ్డారు.


Also read : Dalita bandhu scheme: దళిత బంధు పథకంపై Kadiyam Srihari సంచలన వ్యాఖ్యలు


తెలంగాణలో గతంలో చేపట్టిన సమగ్ర సర్వే ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి. ఆ ప్రకారమే హుజూరాబాద్‌లో ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు అందిస్తామని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. దళిత బంధు పథకం ఒక ఉద్యమంలా కొనసాగాలని, ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు. 


హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనియాంశమైంది. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై ప్రకటన చేశారో.. అప్పటి నుంచే నిత్యం పతాక శీర్షికలకు ఎక్కుతూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. దళిత బంధు పథకం కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసమే తీసుకొచ్చారని, హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad bypolls) తర్వాత సీఎం కేసీఆర్ మళ్లీ ఈ పథకాన్ని కూడా అటకెక్కిస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 


Also read : Dalita bandhu scheme: దళిత బంధు అందరికీ ఇవ్వకపోతే దీక్ష తప్పదు: ఈటల రాజేందర్


దళిత నాయకుల్లోనూ దళిత బంధు పథకంపై రెండు వర్గాలుగా విడిపోయారు. దళిత బంధు పథకం దళితుల సంక్షేమానికి, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని టీఆర్ఎస్ పార్టీ మద్ధతుదారులైన దళిత నేతలు చెబుతుండగా.. కేవలం ఉప ఎన్నికలో ఓట్ల కోసమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఇంకో వర్గం ఆరోపిస్తోంది. ఇన్ని ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యే ఇవాళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధు పథకం (Dalita Bandhu Scheme) లాంఛనంగా ప్రారంభమైంది.


Also read : ఈటల రాజేందర్‌ భాషపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook