KCR Movie Release: అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటే.. తెలంగాణకు మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని.. ఆయన చేసిన అభివృద్ధి..  సామాజికంగా.. సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కేసీఆర్ పేరుతో సినిమా తీయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 'కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీఆర్‌ అద్భుతంగా అభివృద్ధి చేశారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్ రావు వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DK Aruna: 'లగచర్ల లడాయి' తీవ్ర రూపం.. డీకే అరుణ అరెస్ట్‌తో తీవ్ర ఉద్రిక్తత


 


హైదరాబాద్‌లో జబర్దస్త్‌ రాకింగ్‌ రాకేశ్‌ తెరకెక్కించిన 'కేశవ చంద్ర రామావత్ – కేసీఆర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సోమవారం జరిగింది. ఓ హోటల్‌లో నిర్వహించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొని మాట్లాడారు. 'అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటే.. తెలంగాణకు మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్. అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో.. స్ఫూర్తితో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. కేసీఆర్ పేరుతో సినిమా తీయడం గొప్ప విషయం' అని తెలిపారు.

Also Read: KTR Press Meet: బట్టలిప్పినట్టు రేవంత్‌ రెడ్డి వైఫల్యాల చిట్టా విప్పిన కేటీఆర్‌


 


'కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం సాధించి.. అద్భుతంగా అభివృద్ధి చేశారు. పల్లెలనే కాదు, పట్టణాలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి రజినీకాంత్ న్యూయార్క్‌లో ఉన్ననా, ఇండియాలో ఉన్ననా అన్నాడు. భౌతికంగా మాత్రమే కాదు.. రాష్ట్రాన్ని సామాజికంగా.. సాంస్కృతికంగా అభివృద్ధి చేశారు' అని వివరించారు. 'తెలంగాణను దేశానికి దిక్సూచిగా కేసీఆర్‌ చేశారు. ఎవరైనా అధికారంలో ఉన్నపుడు సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకున్నా కేసీఆర్ అని సినిమా తీశాడు. దీనికి ఎంతో ధైర్యం, దమ్ము కావాలి. నిజమైన అభిమానానికి ఇది నిదర్శనం' అని పేర్కొన్నారు.


'అందరూ కేసీఆర్ సినిమా చూసి రాకేశ్‌‌ను అభినందించాలని ఆకాంక్షిస్తున్నా. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాకింగ్‌ రాకేశ్‌ తీసిన 'కేసీఆర్‌' సినిమా ఈనెల 22వ తేదీన విడుదల కానుంది. తెలంగాణలోని లంబాడీ సామాజిక వర్గం నేపథ్యంలో తీసిన 'కేసీఆర్' సినిమాలో రాకేశ్ 'చోటా కేసీఆర్' పాత్రలో నటించాడు. అంతేకాకుండా అతడి భార్య జోర్దర్ సుజాత కీలక పాత్రలో చేసింది. ఈ సినిమాపై రాకేశ్ భారీ అంచనాలు పెంచుకున్నాడు. మరి చూడాలి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter