Delhi Liquor Case MLC kalvakuntla kavitha Will Go Tihar Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు కవిత కస్టీడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపచ్చారు. ఈ క్రమంలో కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులు వందల కోట్ల కుంభకోణం ఉందని, ఇలాంటి వ్యక్తులు బెయిల్ పై విడుదలైతే కేసు తప్పుదొవపట్టించే అవకాశం ఉందంటూ ఈడీ అధికారులు తమ వాదనలను కోర్టు ఎదుట విన్పించింది.ఈ క్రమంలోనే రౌస్ అవెన్యూ కోర్టు.. ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇక కవిత బెయిల్ అభ్యర్థనను ఏప్రిల్ 1న విచారిస్తామని తెలిపింది. దీంతో పోలీసులు కవితను తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: షాకింగ్ లో మహిళ.. రీల్స్ చేస్తుండగా ఆ పనికానిచ్చిన ఆగంతకుడు.. వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో మరింత హీట్ ను పుట్టిస్తుంది. ఒకవైపు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.  ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను కోర్టు ఈడీకి అప్పగించింది. అయితే.. ఈరోజుతో (మార్చి 26,2024) తో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు మరల ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పర్చడానికి తీసుకెళ్లారు.


Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..


ఈ క్రమంలో కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఇది మనీలాండరీంగ్ కేసుకాదు.. పొలిటికల్ లాండరీంగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. తొందరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ.. జై తెలంగాణ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఒక నిందితుడు బీజేపీలో చేరాడు.. ఒక నిందితుడు బీజేపీ నుండి టికెట్ పొందాడు.. ఒక నిందితుడు బీజేపీకి 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చాడంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook