MLC Kavitha: లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టులు.. ఢిల్లీలో కవిత! ఏం జరగబోతోంది?
MLC Kavitha: లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో సీఎంకేసీఆర్ కూడా అసహనంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పలు సమావేశాల్లో కవిత కనిపించలేదు.ఈ సమయంలో కీలక పరిణామం జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఆమె ఉన్నారు
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను అరెస్ట్ చేసిన సీబీఐ... కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. అభిషేక్ ఇచ్చే వివరాల ఆధారంగా మరిన్ని అరెస్టులు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లై అప్రూవర్ గా మారనున్నారనే వార్తలు వస్తున్నాయి.దీంతో లిక్కర్ స్కాంలో కీలక అరెస్టులు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లడం చర్చగా మారింది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కవిత ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు. గతంలో నిజామాబాద్ ఎంపీగా పని చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఆమె హాట్ టాపిక్ గా మారారు. దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె పేరు తెరపైకి రావడం కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కాం జరిగిందని... ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కాక రేగింది. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కూతురు కాబట్టే తనను టార్గెట్ చేశారని చెప్పారు. అయినా కవితపై ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోనూ సోదాలు జరిగాయి. సీబీఐ, ఈడీ దాడులన్ని ఎమ్మెల్సీ కవిత సన్నిహితుల చుట్టే తిరుగుతున్నాయి. లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. అభిషేక్ విచారణ తర్వాత కీలక పరిణామాలు ఉంటాయనే చర్చ సాగుతోంది. లిక్కర్ స్కాంలో వరుసగా జరగుతున్న పరిణామాలతో ఏం జరగబోతుందోనన్న ఆందోళన టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది.
లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో సీఎంకేసీఆర్ కూడా అసహనంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. కూతురిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పలు సమావేశాల్లో కవిత కనిపించలేదు. నిజామాబాద్ ఎంపీగా గతంలో జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా పని చేశారు కవిత. జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నేతలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. అలాంటింది బీఆర్ఎస్ ఏర్పాటు ప్రక్రియలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పలు చర్చలకు తావిచ్చింది. లిక్కర్ స్కాం ప్రభావంతో కేసీఆర్ దూరం పెట్టడం వల్లే కవిత పార్టీ సమావేశాలకు రావడం లేదనే కథనాలు వచ్చాయి. దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన సమయంలో తెలంగాణ భవన్ లో కవిత మిస్సయ్యారు. ఇది అనుమానాలను మరింత బలపరిచింది. ఈ సమయంలో కీలక పరిణామం జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఆమె ఉన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ తో కలిసి హాజరయ్యారు. తర్వాత తండ్రితో పాటు ఢిల్లీ వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని పరిశీలించారు.
నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు సంబంధించి కొందరు నేతలతో ఆయన చర్చలు జరపనున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఈ నాలుగు రోజులు ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ తో కలిసి ఢిల్లీలో ఉంటారని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ వెంట కవిత ఎందుకు ఢిల్లీ వెళ్లారన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కవితను యాక్టివ్ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. జాతీయ స్థాయి నేతలతో జరగనున్న సమావేశాల్లో ఇకపై ఆమె కీలకంగా ఉంటారని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో కవితే చత్రం తిప్పబోతున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కవిత ఢిల్లీ పర్యటనపై సోషల్ మీడియాలో మరో చర్చ కూడా సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కేంద్ర పెద్దలతో డీల్ కోసమే కవిత ఢిల్లీ వచ్చారనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కేసీఆర్. కాని బీఆర్ఎస్ పార్టీ ప్రకటన రోజున మాత్రం బీజేపీ ఊసే ఎత్తలేదు. తర్వాత కూడా మాట్లాడటం లేదు. ఇది కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఏదైనా జరుగుతుందా అన్న అనుమానాలకు కారణమవుతోంది.
Also Read : GarikaPati - Chiranjeevi : అదృష్టం కొద్దీ చిరంజీవి అధికారంలోకి రాలేదు.. గరికపాటి నాటి వీడియో వైరల్
Also Read : Samantha : నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు!..అది చూపిస్తూ సమంత పోస్ట్.. ఉద్దేశ్యం ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి