K Kavitha Remand: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎలాంటి ఊరట లభించలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమెకు మరోసారి రిమాండ్‌ పొడిగించారు. జూన్‌ 3వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్‌ ముగిసిన కవితకు మరోసారి ఆశాభంగం ఏర్పడింది. అయితే విచారణ సందర్భంగా కవితను ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్‌ హాజరుపరచడం విశేషం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Graduate MLC Election: బ్లాక్‌ మెయిలర్‌ తీన్మార్ మల్లన్న వద్దు.. గోల్డ్‌ మెడలిస్ట్‌ రాకేశ్ రెడ్డిని గెలిపించండి


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను హైదరాబాద్‌లో మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. మార్చి 16న ట్రయల్‌ కోర్టులో హాజరుపరిచారు. కవిత నేతృత్వంలో సౌత్‌ గ్రూపు రూ.100 కోట్లు ఆప్‌ కీలక నాయకులకు చేరాయనే ఆరోపణలపై ఈడీ విచారణ చేప్టింది. ఆమె నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొదటిసారి 10 రోజులు ఈడీ కస్టడీకి తీసుకుంది. అనంతరం మార్చి 26l జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు.

Also Read: Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..


ప్రస్తుతం తిహార్‌ జైలులో కవిత కస్టడీలో ఉన్నారు. ఆ సమయంలో ఏప్రిల్‌ 11వ తేదీన కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. కోర్టు సీబీఐ కేసులోనూ జ్యూడిషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ రెండు కేసుల్లోనూ కవిత జ్యూడిషియల్‌ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఇప్పుడు తాజాగా 14 రోజులు రిమాండ్‌ పొడిగించడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. కాగా ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఢిల్లీలో కవితను కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కవితను కక్షపూరితంగా జైల్లో వేశారని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్ట్‌ చేశారని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter