హైదరాబాద్ ఘట్‌కేసర్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున అసాధారణ సంఘటన జరిగింది. ఓ నిండు గర్భిణీకి ఆంబులెన్స్‌లోనే డెలివరీ జరిగింది. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్లవారుజామున సరిగ్గా 3  గంటల 5 నిముషాలు అవుతోంది. మేడిపల్లి మండలం కమలానగర్‌లో నివసిస్తున్న నిండు గర్భిణీ అయిన స్వాతి అనే వివాహితకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కరోనా వైరస్  లాక్ డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సదుపాయాలు అందుబాటులో  లేవు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. వెంటనే 108 సిబ్బంది ఆమె ఇంటికి చేరుకున్నారు. 


ఘట్ కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించే ప్రయత్నం చేశారు. కానీ సీపీఆర్ఐ సమీపంలోకి  రాగానే పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.  ఐతే ఆంబులెన్స్ సిబ్బంది పైలెట్ బద్రు, ఈఎంటీ సతీష్ .. 108ను రోడ్డు పక్కగా ఆపేశారు. ఆమెకు డెలివరీ చేశారు. అంతా సవ్యంగా జరిగింది. పండంటి మగబిడ్డకు స్వాతి జన్మనిచ్చింది.  


దీంతో స్వాతి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం  చేశారు. కష్టకాలంలో అండగా నిలిచి తల్లీ, బిడ్డ ప్రాణాలు రక్షించిన ఆంబులెన్స్   సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత తల్లీ, బిడ్డలను ఇద్దరినీ ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..