Bhatti Vikramarka Fires On BRS Leaders: ఎన్నో కలలు కోరికలతో భవిష్యత్‌లో మార్పు తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాలు, నిరుద్యోగ  యువతి యువకులు, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని, ఆశలు ఆకాంక్షలు కలలు నెరవేరాలని తెలంగాణ తెచ్చుకున్నారని.. వారందరి శ్రేయస్సు ఇప్పుడు తమ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, భవిష్యత్ కోసమే అర్థవంతంగా ప్రతి పైసా ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని వాడుకున్నారని విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మాజీ మంత్రులు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ క్యాన్సిల్ అవ్వడంతో హైదరాబాద్‌కు నష్టం జరిగిందంటున్నారు. ఫార్ములా ఈ రేసు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన ప్రయోజనం, వచ్చిన ఆదాయం చెప్పకుండా నష్టం జరిగిందని గగ్గోలు పెట్టడం సరికాదు. ఫార్ములా ఈ రేస్ ఈవెంట్  పేమెంట్ బిజినెస్ రూల్స్‌కు భిన్నంగా జరిగింది. దీనిపై న్యాయ విచారణ చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఫార్ములా ఈ రేస్ టికెట్లు అమ్ముకొన్న నెక్స్ జెన్ సంస్థ లబ్ధి పొందింది. ఈవెంట్ నిర్వహించిన ఫార్ములా ఈ కంపెనీ రూ.110 కోట్ల లబ్ధి పొందింది. ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించేందుకు నిధులు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఆదాయం వచ్చింది..?


ఫిబ్రవరిలో నిర్వహించే ఈవెంట్ కోసం గతంలో ఉన్న త్రైపాక్షిక అగ్రిమెంట్‌ను కాదని ద్విపక్ష అగ్రిమెంట్  ఎలా చేస్తారు..? ఈవెంట్ నిర్వహణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లేకుండా సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీతో 55 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈవెంట్ నిర్వహణకు 110 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ కంపెనీకి ఒప్పుకుని 55 కోట్ల రూపాయలు చెల్లించగా, మిగతా బ్యాలెన్స్ 55 కోట్ల రూపాయలు చెల్లించాలని ఫార్ములా ఈ కంపెనీ నోటీసులు పంపారు. ఈ రేస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమి లేదు. ఈ రేస్ వాళ్లు వచ్చి హైదరాబాద్ చూసి వెళ్తారు ఆట. వారు చూసి పోవడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి.? గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు.. రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టిన మీరేనా ఈ మాటలు మాట్లాడేది..?" అని డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. 


గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని వారి అవసరాల కోసం వాడుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుట కోసం ఎవరికి తల వంచమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన సొత్తును ఎవరికి ధారాధత్తం చేయడానికి ఒప్పుకోమమన్నారు. రాష్ట్రాన్ని అధోగతి చేసి ఇప్పుడు ప్రజలకు మళ్లీ భ్రమలు కల్పించే విధంగా అసత్య ప్రచారం చేయడం ప్రతిపక్షం మానుకోవాలని హితవు పలికారు. రైతు బంధు నిధులు రోజు వారిగా నిధులు విడుదల చేస్తున్నామని.. ఒక ఎకరం ఉన్న రైతులకు ఇప్పటికే రైతు బంధు నిధులు ఇచ్చామన్నారు. రెండు ఎకరాలున్న రైతులకు నిధులు వేస్తున్నామన్నారు. విడతల వారీగా రైతులకు రైతుబంధు నిధులు ఇస్తామని చెప్పారు. 


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook