COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Twitter War: రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు ట్విట్టర్‌ లో మాటల తూటాలు పేలాయి. సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి  ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్నారు. రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా వీరిద్దరి మధ్య ట్విట్టర్‌ లో డైలాగ్‌ వార్‌ నడిచింది. రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్టర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు. రాహుల్‌ గాంధీ ఎన్నిసార్లు పార్లమెంట్‌ లో తెలంగాణ సమస్యలను ప్రస్తావించారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం, దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ముఖచిత్రాన్నిఎలా మార్చాయో కాంగ్రెస్‌ నాయకులను అడిగి తెలుసుకోవాలన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాల్లో కొన్నింటిని 11 రాష్ట్రాలు అమలుచేస్తున్నాయని కవిత చెప్పారు. ఆ పథకాల గురించి అర్థం చేసుకునేందుకు తెలంగాణకు వస్తున్న రాహుల్‌ గాంధీకి స్వాగతం అని కవిత ట్వీట్‌ చేశారు.




అటు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు ఎక్కడ ఉన్నారని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. వరి వేస్తే ఉరి అన్న మీ తండ్రి మాత్రం ఫాంహౌస్‌ లో 150 ఎకరాలలో వరి పంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని కవిత రేవంత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు బోరున విలపిస్తుంటే మీరెక్కడ అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా మోదీ పంచన చేరి తెలంగాణను నాశనం చేశారని మండిపడ్డారు. విభజన హామీలను సాధించకుండా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని, రాహుల్‌ గాంధీని ప్రశ్నించడానికి సిగ్గు అనిపించడం లేదా విమర్శించారు.




మొత్తంగా రాహుల్‌ పర్యటన సందర్భంగా తెలంగాణ రాజకీయాలు మాత్రం హీటెక్కాయి అని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరంగల్‌ లో జరిగే రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొని.. వరంగల్‌ డిక్లరేషన్‌ ను ప్రకటిస్తారు.


Also Read: Adi shankaracharya: నేడు ఆది శంకరాచార్య జయంతి... అద్వైత సిద్దాంతకర్త గూర్చి ఈ విషయాలు మీకు తెలుసా...


Also Read: David Warner Record: డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.