Sajjanar: పల్లె వెలుగు బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్.. వివరాలివే..
RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పల్లెవెలుగు ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు.. ఇన్నిరోజుల పాటు పడిన ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొవచ్చు.
Phone pay and google pay digital payment system in pallevelugu busses: సాధారణంగా చాలా మంది బస్సులో ఎక్కువగా జర్నీలు చేస్తుంటారు. ఇక తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సులు ఏ సీజన్ లో చూసిన కూడా ఫుల్ రష్ గా ఉంటున్నాయి. మరోవైపు బస్సులో తరచుగా చిల్లర విషయంలో గొడవలు జరుగుతుంటాయి. కండక్టర్ లు టికెట్ లకు సరిపడ చిల్లర ఇవ్వాలని చెప్తున్న కూడా.. చాలా మంది చిల్లర విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోరు. పైగా కండక్టర్ లు, డ్రైవర్ లతో గొడవలకు కూడా దిగుతుంటారు.
చాలా సార్లు బస్సులలో టికెట్ విషయంలో గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లగ్జరీ బస్సులు, దూర ప్రాంతాలకు వెళ్లే డీలక్స్ లు,సూపర్ లగ్జరీ బస్సులలో టికెట్ ల కోసం స్కాన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం.. తాజాగా, గ్రామాల్లో ఎక్కువగా తిరిగే.. పల్లెవెలుగు బస్సులలో కూడా ఈ స్కాన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఫోన్ పేలు, గూగుల్ పేలు, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపుల్ని సైతం.. ఇక మీదట యాక్సెప్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మేరకు ఐటిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్)లో సాఫ్ట్‌వేర్‌ను సైతం అప్డేట్ చేశారు. ప్రయాణికులు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్‌కార్డులతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
దీని వల్ల గ్రామాల్లోని ప్రయాణికులు సైతం.. బస్సులలో ఇక మీదట చిల్లర సమస్యలతో ఇబ్బందులు దూరమయ్యాయని చెప్పుకొవచ్చు. చాలామంది ప్రయాణికులు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తుండటం, డబ్బులు తమతో పాటుగా పెట్టుకొక పోవడం వల్ల చిల్లర సమస్యఏర్పడేది. దీంతో తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల.. ప్రజలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..
ఆర్టీసీ ఏర్పాటు చేసిన డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్‌తో అన్ని రకాల సేవలను ఇక మీదట పొందవచ్చు.. ఒక్కసారి కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీకి సంబంధించిన పది రకాల యాప్‌లు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్(వెబ్‌సైట్), గమ్యం(ఆండ్రాయిడ్ ఐఓఎస్) తదితర సేవలను ప్రయాణికులు పొందవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.