Telangana: 24 గంటల్లో 2,083 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 11 మంది కరోనావైరస్‌తో ( Coronavirus ) బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 11 మంది కరోనావైరస్‌తో ( Coronavirus ) బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 64,786 మందికి చేరుకోగా.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 530 కి చేరింది ( COVID-19 death toll).
కరోనావైరస్ నుంచి గత 24 గంటల్లో 1,114 మంది కోలుకున్నారు. అలా ఇప్పటివరకు కరోనా నుంచి 46,502 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం మరో 17,754 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈమేరకు రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.
ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 228, మేడ్చల్ జిల్లాలో 197, వరంగల్ అర్బన్‌లో 134 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.