NEET cancellation: నీట్ రద్దు విషయంలో కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ
DMK MPs met minister KT Rama Rao : మంత్రి కేటీఆర్‌తో తమిళనాడు డీఎంకే ఎంపీలు భేటీ అయ్యారు. నీట్ రద్దుకు డిమాండ్ చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను డీఎంకే ఎంపీలు కేటీఆర్‌కు అందజేశారు.
DMK MPs called on TRS working president and Telangana IT minister KT Rama Rao to support for cancellation of NEET this year: మంత్రి కేటీఆర్‌తో (KTR) తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీలు బుధవారం భేటీ అయ్యారు. కేటీఆర్‌ను వారు తెలంగాణ భవన్‌లో కలిశారు. నీట్ (NEET) రద్దుకు డిమాండ్ చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ (cm stalin) సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను డీఎంకే ఎంపీలు (DMK MPs) కేటీఆర్‌కు అందజేశారు. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల 12 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు.
Also Read : Gambhir Comments on Kohli: 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే': గంభీర్
కేటీఆర్‌ను కలిసిన వారిలో డీఎంకే ఎంపీలు ఇళంగోవన్, (dmk mp elangovan) కళానిధి వీరస్వామి తదితరులున్నారు. ఈ సందర్భంగా ఇళంగోవన్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రద్దు (NEET cancellation) అంశంపై కేటీఆర్‌ను కలిసినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నీట్ (NEET) పరీక్ష రద్దు చేయాలని తాము కోరుతున్నామన్నారు. ఈ విషయంలో కేంద్ర విధానంపై నిరసన తెలుపుతున్నామని వెల్లడించారు. తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అయితే తమ విన్నపానికి కేటీఆర్ (KTR) సానుకూలంగా స్పందించారని డీఎంకే ఎంపీ ఇళంగోవన్ అన్నారు.
Also Read : యూపీలో దారుణం: బాలికపై 28 మంది అత్యాచారం!