'కరోనా వైరస్' . . ఈ పేరు వింటేనే సామాన్య జనానికి ఒంటిలో నుంచి వణుకుపుడుతోంది. దీంతో ఈ వైరస్ బారిన పడవద్దని. . ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందరూ మాస్క్ లు ధరించడం మొదలు పెట్టారు. దీంతో  కరోనా వైరస్ దెబ్బకు మాస్క్ ల కొరత ఏర్పడింది. అంతా N-95 మాస్కులకు ఎగబడడంతో అసలు వైరస్ ఉన్న వారికి మాస్క్ లు దొరకని పరిస్థితి నెలకొంది. నిజానికి కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే.. N-95 మాస్కులే వాడాలని ఎక్కడా లేదు. మాస్క్ లు కేవలం ముందు జాగ్రత్త కోసమే. 


Read Also: అనుష్క నిశ్శబ్దం.. అదిరింది..!!


చేతులు శుభ్రంగా కడుక్కోవడమే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చేయాల్సిన అసలు పని. నిజానికి మనుషుల్లో కరోనా వైరస్ ను తట్టుకనే రోగ నిరోధక శక్తి ఉంటుంది. కానీ చాలా మంది.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఎక్కువగా ప్రతి స్పందించి.. భయాందోళనకు లోనవుతున్నారు. మాస్క్ వాడితే కరోనా వైరస్ సోకదనే నిర్ణయానికి వచ్చేశారు. కానీ మాస్క్ లు ఎవరికి అవసరం..? అనేది ఆలోచించడం లేదు. కాబట్టి దీనిపై సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మెగాపవర్ స్టార్ సతీమణి ఉపాసన ఓ వీడియో రూపొందించారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మాస్క్ లు ఎవరు వాడాలి..? ఎలా వాడాలి అనే విషయాలు చెబుతున్నారు. ఆ వీడియో మీకోసం..!!



 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..