Driver Brutally attacked on woman and raped in Harikirshna travel bus in Hyderabad:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతలో కోసం ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కొందరు దుర్మార్గులు మాత్రం మారటడం లేదు. ప్రతిరోజు మహిళలపై దాడులు,అత్యాచార ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.  బస్టాండ్ , రైల్వే స్టేషన్, ఆఫీసు ఎక్కడ కూడ మహిళలకు సెఫ్టీ లేదని చెప్పుకొవచ్చు. చివరకు కొన్ని చోట్ల కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్లు సైతం అత్యాచారాలకు దిగుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more:  2 Deers battle: బార్డర్ లో కుమ్ముకున్న భారత్ ,పాక్ జింకలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..


ఈ క్రమంలో.. తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ కూడా వేధింపులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొందరు పోలీసులు నెంబర్ లు తీసుకుని వేధించి,అత్యాచారాలకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, హైదరబాద్ లో నిర్భయ తరహా ఘటన జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 


పూర్తి వివరాలు..


నిర్మల్ నుంచి ఒక మహిళ ప్రకాశం వెళ్లేందుకు హరికృష్ణ ట్రావెల్స్ బుక్ చేసుకుంది. బస్సులో ఇతరులు ఎవరులేరు. దీంతో మహిళ తొలుత భయాందోళనకు గురైంది. అసలు ఇది ప్రకాశం వెళ్తుందా.. అని కూడా ఆరా తీసింది. ఈ క్రమంలో డ్రైవర్ లు ఇద్దరు మహిళకు మాయమాటలు చెప్పారు. ఏసీ బస్సు కావడంతో విండోస్ క్లోజ్ చేయాలన్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం.. మహిళపై దాడి చేశారు. అంతేకాకుండా.. ఆమె నోట్లో గుడ్డలు కుక్కీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను మేడ్చల్ సమీపంలో వదిలేసి, ఎవరికైన చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారు.


వెంటనే సదరు మహిళ 100 పోలీసులకు కాల్ చేసి జరిగిన ఘోరాన్ని చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బస్సు.. ఓయూపరిధిలో ఉన్నట్లు కనుగోన్నారు. వెంటనే బస్సును ట్రాక్ చేసి, పోలీసులు నిందితులును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దుర్మార్గులు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసినట్లు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.


Read more:Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద నాగు పాము.. వీడియోవైరల్..


ఓయూ పీఎస్ పరిధిలో బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసుల బస్సును సీజ్ చేసి  సిద్దయ్య డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో డ్రైవర్ కృష్ణ  పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన స్లీపర్ కొచ్  అని తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter