BC Janasabha and dsc and groups unemployed aspirants protest: తెలంగాణలో నిరుద్యోగుల వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు పోస్టులు తక్కువగా ఉన్నాయని, సమయం కూడా లేదని, డీఎస్సీ, గ్రూప్స్ అభ్యర్థులు తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నిరుద్యోగ అభ్యర్థులు.. అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ ల దగ్గర కూడా భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. పోస్టులు సంఖ్యలను పెంచి, మరల నోటిఫికేషన్ లు వేయాలని  కూడా అనేకన పర్యాయాలు ప్రభుత్వంకు తమ గోడును చెప్పుకున్నారు. దీనిలో భాగంగానే ఓయూలో కూడా విద్యార్థులు నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కూడా.. విద్యార్థుల పట్ల కాస్త సెటైరీక్ గా మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నిరుద్యోగులు ఇంకా ఆలస్యం చేస్తే, బెండకాయల్లా ముదిరిపోతారంటూ  కూడా కామెంట్లు చేశారు. గ్రూప్స్, డీఎస్సీ లు ఇప్పుడు వాయిదా వేస్తే.. కోర్టు సమస్యలు వస్తాయన్నారు.  ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ ఒక వైపు నిరుద్యోగులు రోడ్లమీద వచ్చేదానికన్నా.. మంత్రులతో తమ గోడును చెప్పుకొవాలన్నారు. మరోవైపు సీతక్క మాత్రం నోటిఫికేషన్ ప్రకారమే ఎగ్జామ్ లను నిర్వహిస్తామని తెల్చిచెప్పారు. అదేవిధంగా మరల డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. మరల డీఎస్సీ ఉంటుందని, నిరుద్యోగులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా నిన్న తెల్చి చెప్పారు.


ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు.. సీఎం రేవంత్ రెడ్డి సెక్రెటెరియట్ లో పలు శాఖల అధికారులతో రివ్యూను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు, బీ.సీ. జనసభ నేతలు సెక్రెటెరియట్ ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు మూడంచెల భద్రతను సచివాలయం దగ్గర మోహరించారు. నిరుద్యోగ సంఘం నేతల్ని, విద్యార్థి సంఘం నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్ లను సిద్దంగా ఉంచుకున్నారు. ఈ క్రమంలో కొందరు సెక్రెటెరియట్ లోపలికి దూసుకొని రావడానికి ప్రయత్నించారు.


వెంటనే పోలీసులువారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. సెక్రటేరియట్‌ను ముట్టడించిన బీ.సీ జనసభ అధ్యక్షుడు, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీ.సి కులగణన వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీ.సీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసిన బీ.సీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. అదే విధంగా..డీఎస్సీ, గ్రూప్స్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున సెక్రెటెరియట్ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. 
 


సెక్రటేరియట్ పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. మరోవైపు.. జిల్లాల నుంచి తరలి వస్తున్న సంఘాల నాయకులను ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది. అశోక్‌నగర్ క్రాస్ రోడ్డులో, దిల్ సుఖ్ నగర్ ల నుంచి నిరుద్యోగుల వస్తున్నారా.. అని పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా.. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, గ్రూప్‌ 2, 3 పోస్టుల పెంపుచేపట్టాలని నిరుద్యోగ అభ్యర్థుడు డిమాండ్ చేశారు.


Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..


గ్రూప్‌-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో సెక్రటేరియట్ ముట్టడికి బీసీ అధ్యక్షులు రాజారాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సెక్రెటెరియట్ దగ్గర హైడ్రామా నెలకొంది.పోలీసులు ఎక్కడికక్కడ నిరుద్యోగ అభ్యర్థులను,  బీసీ సంఘాల నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి