GHMC Elections 2020: హిందూ-ముస్లిం మద్య పోటీగా చిత్రీకరించవద్దు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో విమర్శలు ప్రతి విమర్శలు..ఆరోపణలు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరానికి కేటీఆర్ చేసిందేంటో చెప్పాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ( Greater Hyderabad Elections ) పోరులో విమర్శలు ప్రతి విమర్శలు..ఆరోపణలు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరానికి కేటీఆర్ చేసిందేంటో చెప్పాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
గ్రేటర్ ఎన్నికల సాక్షిగా టీఆర్ఎస్ ( TRS ) నేతలపై బీజేపీ ( BJP ) విమర్శలు ఎక్కుపెడుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు..మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న మంత్రి కేటీఆర్..హైదరాబాద్ నగరానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ( Ghmc elections ) హిందూ-ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దని కోరారు. చింతమడకకు కేసీఆర్ ఇచ్చింది కేవలం 1.5 లక్షలేనని..కేంద్రం 8 లక్షలిచ్చిందని గుర్తు చేశారు. అదే విధంగా భాగ్యనగరంలో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ముంజూరు చేసిందన్నారు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్ లకు లేదని ఎమ్మెల్యే రఘునందర్ రావు ( Dubbaka Mla Raghunandan rao ) స్పష్టం చేశారు.
నగరంలో తమకు నచ్చిన ఆలయానికి వెళ్తామని..గుడికి వెళ్లాలంటే కేసీఆర్ లేదా ఒవైసీ ( Owaisi ) అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. హిందుగాళ్లు బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ కు సరైన రీతిలో సమాధానం చెప్పారన్నారు. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాకే..హైదరాబాద్‌లో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. Also read: Congress party: ఇక పార్టీకు అధికారం కష్టమే: గులాం నబీ ఆజాద్