దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ( Dubbaka Bypoll Results live updates ) ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారపార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా పోటీ సాగుతోంది. రౌండ్..రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దుబ్బాక ఉప ఎన్నికల్లో( Dubbaka Bypoll ) విజయం తమదేనని ధీమా వ్యక్తంచేసిన అధికారపార్టీకు పరిస్థితి అంత సులభంగా కన్పించడం లేదు. పోటీ నువ్వానేనా రీతిలో సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి..అనూహ్యంగా బీజేపీ ( Bjp) ఆధిక్యం ప్రదర్శిస్తూ కన్పిస్తోంది. మొదటి 5 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ...టీఆర్ఎస్ ( TRS ) పై 4 వేల పై చిలుకు మెజార్టీ సాధించింది. అనంతరం 6వ రౌండ్ నుంచి నువ్వా నేనా రీతిలో మెజార్టీ సాగుతోంది. ఇప్పటివరకూ 17 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. 16వ రౌండ్ ముగిసేసరికి 4 వేల పైచిలుకు ఉన్న బీజేపీ ఆధిక్యం 934 ఓట్లకు తగ్గింది. ఇంకా ఆరు రౌండ్ల కౌంటింగ్ లెక్కించాల్సి ఉంది. 


6 వ రౌండ్ నుంచి 12వ రౌండ్ వరకూ సాగిన కౌంటింగ్ లో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పోటాపోటీగా ఆధిక్యాన్ని దక్కించుకున్నాయి. 13వ రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ..బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. 17వ రౌండ్ ఫలితాలు  మరోసారి బీజేపీకు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాయి.  17వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆధిక్యం 16 వందల ఆదిక్యంతో కొనసాగుతోంది. 


18వ రౌండ్ లో ఫలితాలు మరోసారి మారిపోయాయి. 18వ రౌండ్ లో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడంతో బీజేపీ ఆధిక్యం 16 వందల నుంచి ఒక్కసారిగా 173 ఓట్లకు తగ్గిపోయింది. 18 వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం ఎక్కువగా ఉండటంతో...బీజేపీ ఆదిక్యం ( Bjp Majority ) 173కు తగ్గిపోయింది.  Also read:  Bihar Election Result: ఓట్ల లెక్కింపు ప్రారంభం 


19వ రౌండ్ లో పరిస్థితి మరోసారి మారింది. 19 వ రౌండ్ లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించి..బీజేపీ ఓవరాల్ మెజార్టీను తగ్గించేసింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీనే ఆదిక్యం కొనసాగిస్తుండగా..19 వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ తొలిసారి 251 ఓట్లు మెజార్టీకు చేరుకుంది అధికార పార్టీ టీఆర్ఎస్. 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీకు 53 వేల 53 ఓట్లు సాధించగా..బీజేపీ 52 వేల 802 ఓట్లు సాధించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe