TGSRTC Special Buses: పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ట్రాఫిక్ ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల స‌మ‌యాభావం త‌గ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల నుంచి ద‌స‌రాకు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, త‌దిత‌ర ప్రాంతాల నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. సరికొత్తగా ఔఆర్‌ఆర్‌ నుంచి బస్సులను నడుపుతామని ప్రకటించడం విశేషం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR HYDRAA: హైడ్రా పేరుతో రేవంత్‌ రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: కేటీఆర్‌ సంచలనం

ఇక ఐటీ ఉద్యోగుల కోసం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు త‌దిత‌ర ప్రాంతాల‌కు బ‌స్సుల‌ను నడిపేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ద‌స‌రా పండుగకు ప్ర‌త్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌యాణికుల‌కు క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల‌పై త‌మ క్షేత్ర స్థాయి అధికారుల‌తో సోమవారం ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ సమావేశమై ఈ మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో మాదిరిగానే ప్ర‌యాణికుల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉద్యోగులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ర‌ద్దీని బ‌ట్టి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు.


Also Read: DSC Results 2024: దసరా పండుగలోపు నిరుద్యోగులకు శుభవార్త: రేవంత్‌ రెడ్డి


బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఎండీ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కలదు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి.


అక్టోబర్ 12న దసరా పండుగ కోసం వెళ్లేందుకు 9, 10, 11 తేదీల్లో ప్రయాణికులు పోటెత్తే అవకాశం ఉండడంతో ఆ రోజుల్లో మరిన్ని ప్రత్యేక బస్సులను  నడపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. పండుగ సమయంలో ఆర్టీసీ బస్సులకు టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోనుంది. ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, కేపీహెచ్‌బీ, సంతోశ్‌నగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఈసారి కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కాలుష్యరహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.


పోలీస్, ర‌వాణా, మున్సిపల్ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల‌కు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంద‌ని ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. టీజీఎస్ఆర్టీసీ సేవలకు ముందస్తు రిజర్వేషన్‌ అవకాశం కూడా కల్పించినట్లు వివరించారు. దీనికోసం అధికారిక వెబ్‌సైట్ tgsrtbus.inలో సంప్రదించాలని సూచించారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం 040-69440000, 040-23450033 లలో సంప్రదించవచ్చని తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.