PRC Announcement: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకటనకు EC గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. గత కొన్నిరోజులుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న పీఆర్సీ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సర్కార్ నుంచి శుభవార్త రానుంది.
ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుల చేసింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనపై అనుమతి కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం, ఆర్థిక శాఖ లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఈసీ, ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటనకు ఏ ఇబ్బంది లేదని పేర్కొంది. పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంటూ తెలంగాణ(Telangana) ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు ఈసీ కార్యదర్శి అవినాష్ కుమార్ లేఖ రాశారు.
Also Read: Teenmaar Mallanna Fan Suicide: తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక యువకుడు సూసైడ్
సాధారణంగా ప్రభుత్వం పథకాలకు, సంక్షేమ పథకాల అమలు, కొత్త పథకాల ప్రకటనకు సంబంధించి ఎన్నిక కోడ్ నియమావళి పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరుతుంటాయి. సందర్భానుసారం, ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాల నేపథ్యంలో కొన్ని అంశాలల్లో మినహాయింపులు(Telangana PRC) కల్పిస్తుంటాయి.
Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook