ED on Casino: క్యాసినో వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందా అన్న కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. ఈక్రమంలో విదేశాల్లో క్యాసినో వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. విచారణలో క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్ బాగోతాలు ఒక్కొక్కటికిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో క్యాసినో నిర్వహించినట్లు విచారణలో తేలింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లో క్యాసినో ఆడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్లు విచారణలో తేటతెల్లమైంది. ఈకేసులో చికోటి ప్రవీణ్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. విదేశాలకు స్పెషల్ విమానాలు బుక్ చేసినట్లు..ఆరాధ్య ట్రావెల్స్ నుంచి ఇదంతా జరిగిందని తెలుస్తోంది. చికోటి ప్రవీణ్‌ అనుచరుడు ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్‌ ఇంట్లోనూ ఈడీ సోదాలు చేసింది. 


ఈవ్యవహారంలో సంపత్, వెంకటేష్, మాధవరెడ్డి, రాకేష్‌, బబ్లుకు ఈడీ నోటీసులు అందించింది. వచ్చే సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దీంతో ప్రవీణ్‌ అనుచరులంతా విచారణకు రానున్నారు. ఈడీ అధికారులు సీజ్ చేసిన ప్రవీణ్‌ ల్యాప్‌టాప్, మొబైల్స్‌లో డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత నాలుగురోజులుగా హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నేపాల్‌లోని ఓ హోటల్‌లో క్యాసినో ఆడినట్లు తెలుస్తోంది.


ఆ మూలాలన్నీ హైదరాబాద్‌లో వెలుగు చూశాయి. ఇందులో చికోటి ప్రవీణ్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఇటీవల గుడివాడలోనూ క్యాసినో వ్యవహారం వెలుగు చూసింది. ఇందులోనూ ప్రవీణ్‌ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. చికోటి ప్రవీణ్‌తోపాటు పలువురు ప్రముఖులకు లింక్‌లు ఉన్నట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది. త్వరలో చిట్టాలోని పేర్లు ఒక్కొక్కటిగా బయటకు రానున్నట్లు తెలుస్తోంది.


Also read:Karvy Scam: కార్వీ కేసులో ఈడీ విచారణ స్పీడప్..రూ.110 కోట్ల ఆస్తుల అటాచ్..!


Also read:India vs West Indies: టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఫీల్డింగ్..వీడియో వైరల్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook