ED Raids Casino : క్యాసినో మాటున మనీ లాండరింగ్ వ్యవహారానికి తెరలేపిన చికోటి ప్రవీణ్ లింకులపై షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. చికోటి ప్రవీణ్‌కు 200 మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు, వీఐపీలు ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు లీకైన సమాచారం ప్రకారం.. నేపాల్, ఇండోనేషియా, శ్రీలంక కేంద్రాలుగా చికోటి ప్రవీణ్ క్యాసినో దందా నడుపుతున్నాడు. ఇటీవల నేపాల్‌‌లో చికోటి ప్రవీణ్ నిర్వహించిన క్యాసినోలో 16 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కస్టమర్స్ అందరినీ ప్రవీణ్ కోల్‌కతా మీదుగా నేపాల్ తరలించాడు. ఇందుకు గాను ఒక్కో విమానానికి రూ.50 లక్షలు, నేపాల్‌లో బుక్ చేసిన ఒక్కో హోటల్‌కు రూ.40 లక్షలు చెల్లించాడు. కస్టమర్స్ నుంచి రూ.5 లక్షలు చొప్పున వసూలు చేశాడు.


ప్రవీణ్ ల్యాప్‌టాప్‌లో అతనితో సంబంధాలు ఉన్న సినీ సెలబ్రిటీలు, వ్యాపార, రాజకీయ ప్రముఖుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతని ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు చికోటి లింకులన్నీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 


కాగా, చికోటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినోలు నిర్వహిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. చికోటి ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈడీ దర్యాప్తులో ఈ వ్యవహారంతో సంబంధమున్న బడా బాబుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 


Also Read: BJP MPS Protest: రాష్ట్రపతిని 'రాష్ట్రపత్ని' అని వ్యాఖ్యానించిన MP అధీర్ రంజన్.. క్షమాపణ చెప్పాలంటూ BJP ఎంపీల నిరసన


Also Read: Monkeypox Cases: ఆ లైంగిక సంబంధాలు కలిగిన పురుషులకు డబ్ల్యూహెచ్ఓ కీలక విజ్ఞప్తి..   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి