ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి. అంతేకాదు ఈ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ED Raids On Ponguleti: తెలంగాణ కాంగ్రెస్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈరోజు ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లి నుంచి వచ్చిన ఈ ప్రత్యేక బృందం ఏకకాలంలో 16 చోట్లు విస్త్రతంగా తనిఖీలు చేపట్టింది. భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లోని మంత్రి ఇంట్లో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఇలా ఈడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.
పొంగులేటి ఇంటి తో పాటు ఆయనకి చెందిన ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఈడి అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు ఇక ఖమ్మం లోని ఆయన నివాసంలో కూడా రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పొంగిలేటికి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లో రాఘవా కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా ఆఫీస్ లో ఉన్నాయి. శుక్రవారం నాడు ఈడి అధికారులు సీఆర్‌పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఖమ్మం పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికైన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పొంగులేటి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.గత ఎన్నికల్లో నామినేషన్ వేసిన వెంటనే కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ రైడ్స్ నిర్వహించారు. దీని కొనసాగింపుగా తాజాగా మళ్లీ ఈడీ రైడ్స్ నిర్వహిస్తోంది. పొంగులేటిపై వస్తున్న అభియోగాలకు సంబంధించి ఇప్పటికే ఈడీ నోటీస్ పొంగులేటి హర్షాకు ఇచ్చింది. అయినా వారు పెద్దగా స్పందించకపోవడంతో రైడ్స్ మొదలయ్యాయి.
ఇదీ చదవండి: వైఎస్ జగన్ తిరుమల దర్శనం.. డిక్లరేషన్ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రముఖులు వీరే..!
గతంలో పొంగులేటి కొడుకు హర్షకు వాచీ స్మగ్లింగ్ చేసే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని విదేశాల నుంచి ఎలా తీసుకువస్తున్నారు. ఇతర వివరాలను తెలుసుకుంటున్నారని సమాచారం. మనీ లాండరీంగ్ లేదా స్మగ్లింక్‌కు సంబంధించి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆస్తులు కూడా జప్తు చేయవచ్చని సమాచారం. ఈ ఉదయం 5:30 నుంచి సోదాలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబంర్ 10, 17 హిమాయత్ సాగర్ వద్ద ఉన్న నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఖమ్మంలోని ఇంట్లో మొత్తం 17 చోట్ల కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది.
ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ భారీ బహిరంగ లేఖ..
పొంగులేటికి సంబంధించిన రిసార్ట్‌లు, కంపెనీలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇంట్లో నుంచి ఏ వ్యక్తులు బయటకు వెళ్లకుండా, ఆధారాలు తప్పుదోవ పట్టకుండా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మొబైల్స్ కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.