Eetela Rajender Speech: రాష్ట్రాన్ని కేసీఆర్‌ 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణగా మార్చారని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తాను తొలి ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో రాష్ట్రంలో అప్పులు కేవలం 70వేల కోట్లుమాత్రమేనని, ఈ ఎనిమిదేళ్ల కాలంలో రూ.5లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమీ ఎడ్డీ, గుడ్డి తెలంగాణ కాదన్న ఈటల రాజేందర్‌.. ఇది చైత్యన తెలంగాణ అని స్పష్టం చేశారు. ప్రజలు కేసీఆర్‌ను తన్ని తరిమేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 8 ఏళ్ల కాలంలో ప్రజలచేత అసహ్యించుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. తాగుడులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంటోందని, లిక్కర్ ఆదాయం అత్యధికంగా ఉందంటూ అసెంబ్లీలో హరీష్ రావు సిగ్గు లేకుండా ప్రకటించుకున్నాడని ఎద్దేవా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో రైతులకు రైతుబంధు అంటూ ఆశచూపి, పంటలు వేయొద్దని రైతుల కళ్ళల్లో దుమ్ము కొట్టాడని సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణ రైతుల దృష్టిలో కేసీఆర్ ద్రోహిగా మిగిలి పోయాడన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ను బొందపెట్టాలని ఎదురు చూస్తున్నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 



బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఎర్రటి ఎండలో ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పూర్తి చేశారని ప్రశంసించారు. పాదయాత్ర సాగిన ప్రాంతాల్లో ప్రజలను జాగృతం చేశారని కొనియాడారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరబోతోందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర అన్ని ప్రాంతాల్లో జనాలను జాగృతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


సీఎం కేసీఆర్‌.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఈటల.. అరెస్టులతో కేసీఆర్‌ బీజేపీని ఆపలేడని స్పష్టం చేశారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపడం కాదని.. ప్రజలే ఎన్నికల్లో కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలుపుతారని అన్నారు. హుజురాబాద్‌లో ఓటమి భయంతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. అక్కడి ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారని, ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారని ఈటల గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫలితం వెలువడబోతోందని, కేసీఆర్‌కు (CM KCR) ఇక ముల్లెమూట సర్దుకోవడమే మిగిలిందన్నారు.


Also read : Revanth Reddy Letter to Amit shah: అమిత్ షాకు తొమ్మిది ప్రశ్నలు .. రేవంత్ ఘాటు లేఖ


Also read : Ktr On Hyderabad:హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కు రుణపడ్డారు.. కేటీఆర్ సంచలన కామెంట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook