Chalo Nalgonda Meeting: అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభకు కాంగ్రెస్‌ పార్టీ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది. నల్లగొండకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు వెళ్తున్న వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. నల్లగొండ పట్టణంలోకి రాగానే సభకు వెళ్తున్న బస్సులపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు


నల్లగొండ జిల్లా వీటీ కాలనీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన బస్సులు, కార్లు రావడంతో కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌యూఎస్‌ఐ నాయకులు వాటిని అడ్డుకునేందుకు ముందుకు వచ్చారు. నల్లచొక్కాలు ధరించి 'గో బ్యాక్‌ గో బ్యాక్‌' అంటూ నినాదాలు చేస్తూ దూసుకువచ్చారు. బస్సులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు పక్కన నెట్టేశారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యథావిధిగా బస్సులను ముందుకు వెళ్లనిచ్చేలా పోలీసులు సహకరించారు. ఈ దాడితో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవడం పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Also Read: Budget 2024: ప్రజల్లారా ఈ 'బడ్జెట్‌'తో 6 గ్యారంటీలు రావు.. ఆశలు పెట్టుకోవద్దని హరీశ్‌ రావు సూచన


కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఛలో నల్లగొండ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నల్లగొండ పట్టణ శివారులు నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో ఈ బహిరంగ సభను నిర్వహించారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం విశేషం.  అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన తొలి సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో గులాబీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో పాల్గొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి