COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Barrelakka: ప్రస్తుతం కొల్లాపూర్‌ నియోజకవర్గం పేరు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మారుమోగుతోంది. శిరీష అలియాస్‌ బర్రెలక్క నామినేషన్ వేసి పోటీకి దిగడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి అందరికీ తెలిసిందే. బర్రెలక్క స్వతంత్ర అభ్యర్ధికగా పోటీ చేసింది. కొల్లాపూర్‌ నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం ముగ్గురు ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడి నుంచి నర్సింహారెడ్డి(1967),  రంగదాసు(1972), జూపల్లి కృష్ణారావు(2004) ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ సారి బర్రెలక్క గెలిస్తే చరిత్రలో చెరగని ముద్రలా మారుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం బర్రెలక్క గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది ఎంతో చర్చనీయాంశంగా మారింది. 


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గెలుస్తుందా?, శిరీషకు ఎన్ని ఓట్లు వస్తాయనే చర్చ నియోజకర్గంలో జోరుగా జరుగుతుందని సమాచారం. ఇటీవలే కొన్ని సర్వేలు విడుదల చేసిన ఫలితాల్లో శిరీషకు దాదాపు 15 వేలకు పైగా ఓట్లు వస్తాయని అంచనాలు వేసాయి. బర్రెలక్క గెలవపోయినా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని..ఓటర్లు తన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిందని తెలుస్తోంది. ఈ కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయావాకాశాలు ఉన్నాయని విశ్లేషించింన సంగతి తెలిసిందే..


బర్రెలక్క నాగర్​కర్నూల్ జిల్లా పెద్ద‌ కొత్త‌ప‌ల్లి మండ‌లం మ‌రిక‌ల్ గ్రమంలో జన్మించింది. శిరీష నిరుపేద కుటుంబంలో జన్మించింన సంగతి అందరికీ తెలిసిందే..ఈమె తండ్రి మద్యానికి బానిసై బర్రెలక్క చిన్నప్పటి నుంచే తన తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె ఎంతో కష్టపడి సంపాదిస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ  ఓపెన్ యూనివ‌ర్శిటీలో డిగ్రీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపనతో గ్రూప్-1, గ్రూప్-2 ఇత‌ర పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్‌ అయ్యింది. అంతేకాకుండా ఎన్నో సార్లు ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల ఉద్యోగం రాలేకపోయింది. 


అందుకే శిరీష నిరుద్యోగుల సమస్యల గురించి తెలుపుతూ..బర్రెలు కొన్నుక్కుని కాసుకుంటున్నా అనే అమె చేసిన ఓ రీల్‌ వైరల్‌ అయ్యింది.  30 సెకన్లు కలిగిన ఆ రీల్‌ ప్రభుత్వానికి ఓ ప్రశ్నలా మారింది. అంతేకాకుండా ఇదే రీల్‌ ఆమెకు మంచి గుర్తుంపును ఇచ్చింది. అయితే ఈ ఇదే ఫేమ్‌తో నిరుద్యోగుల తరుఫున ఎన్నికల బరిలో దిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చిన కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నిరుద్యోగాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రచారంలో భాగంగా ప్రస్తావించడంతో అమెకు అన్ని వర్గాల మద్దతు లభించింది. దీంతో బర్రెలక్క ఫ్యూచర్‌ రాజకీయల గురించి పెద్ద చర్చ జరుగుతోంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి