IPS Sneha Mehra: ఎన్నికల వేళ అసద్ కు మరో బిగ్ షాక్.. సౌత్ జోన్ డీసీపీగా లేడీ సింగం..
Loksabha elections 2024: ఎన్నికలు దగ్గరపడుతున్న కొలది ఓవైసీ సోదరులకు వరుస షాక్ లు తగులున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాధవీలతకు టికెట్ ఇవ్వడం ఓవైసీ బ్రదర్స్ భరించలేకపోతున్నారు.ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్ ఇచ్చింది. సౌత్ జోన్ డీసీపీగా ఒక లేడీ ఐపీఎస్ అధికారిణిని నియమించింది.
IPS Sneha Mehra Appointed as Southzone DCP: ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రస్తుతం మరీంత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే.. అధికారుల మీద ఎన్నికల సంఘం ఒక నిఘా పెడుతుంది. ముఖ్యంగా ఎవరివైపు కూడా పక్షపాతం చూపించకుండా ఉన్న అధికారులను మాత్రమే ఎన్నికల విధుల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటుంది. ఎక్కడైన అధికారులు నేతలతో కుమ్మక్కైయ్యారని ఏమాత్రం సమాచారం అందిన కూడ వెంటనేవారిపై బదీలీవేటు వేస్తుంది. ఎన్నికలలో ముఖ్యంగా అధికార నాయకులు కానీ, అపోసిషన్ నేతలు.. ముఖ్యంగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై తరచుగా ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఎన్నికల సంఘం కూడా తమ నెట్ వర్క్ ఉపయోగించి సదరు అధికారులపై వచ్చిన ఆరోపణల్లో నిజమేంత అని ఆరాతీస్తుంది. ఏమాత్రం అనుమానం కల్గిన వెంటనే సదరు అధికారులను అక్కడి నుంచి తప్పించి, వెయిటింగ్ లో పెట్టేయడం, ఎన్నికలలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం వంటికి చేస్తుంటుంది. ఇవన్ని మనంతరచుగా వార్తలలో చూస్తుంటాం.
ఇదిలా ఉండగా.. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెందిన ఎంపీ ఎన్నికలు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఒకవైపు బీజేపీ తమ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దింపడం చేసింది. మరోవైపు బీజేపీ కు ఎందరో నేతలున్న కూడా మాధవీలతను దించడం వెనుక అనేక స్ట్రాటజీలున్నట్లు తెలుస్తోంది. ఇక మాధవీలత కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఓల్డ్ సిటీ అంతా పర్యటిస్తు, కులమతాలకు అతీతంగా ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఎలాంటి సదుపాయాలు, డెవలప్ మెంట్ కల్పిస్తామో కూడా చెప్తున్నారు. మాధవీలత మీటింగ్ లలో, సభలలో తరచుగా ఓవైసీ బ్రదర్స్ లపై ఫైర్ అవుతున్నారు. ఓవైసీలు పాతబస్తీకి చేసిందేమీలేదంటూ తీవ్ర స్థాయిలో ఏకీపారేస్తున్నారు. ఈక్రమంలో ఓవైసీలు ఏకంగా మమ్మల్నిచంపడానికి కొందరు కుట్రలు చేస్తున్నారు.. జైలుకు పంపుతారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు.
అయితే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అసద్ కు మరో షాక్ ఇచ్చింది. సౌత్ జోన్ కు కొత్త డీసీపీగా స్నేహా మెహ్రాను నియమిస్తు ఉత్తర్వులు జారీచేసింది. వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించాలిన కూడా ఆదేశించింది. అదే విధంగా.. ఇప్పటిదాక ఇక్కడ పనిచేస్తున్న సాయిచైతన్యను ఎన్నికల సంఘం.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. గత కొన్నేళ్లుగా సాయిచైతన్య ఇక్కడే డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించడం, తెలంగాణ వ్యాప్తంగా ఐపీఎస్ ల బదిలీ జరిగిన కూడా ఒక్కసౌత్ జోన్ లోని ఈ అధికారి మాత్రం అదే స్థానంలో ఉండటం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై గలకారణాలపై నివేదిక ఇవ్వాలని కోరింది.
Read More: Viral Video: నా భార్య సీట్లోనే కూర్చుంటావా..?.. బస్సులో కోట్లాటకు దిగిన భర్తలు.. వైరల్ వీడియో..
ఇకమరోవైపు.. సాయిచైతన్న మజ్లీస్ కు వత్తాసు పలుకుతున్నాడని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. 2018 బ్యాచ్ కు చెందిన ముక్కుసూటీగా పనిచేసే అధికారిణిగా పేరున్న స్నేహా మెహ్రాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. స్నేహ మిశ్రా బుక్ లా పాటిస్తు,ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా లేడీ సింగంలా తనపని తాను చేసుకుంటూ వెళ్తారనిమంచి పేరు ఉంది. ఇప్పటిదాక ఆమెపై ఎలాంటి అవినీతి మరకలు లేవు. ఈ క్రమంలోనే స్నేహా మెహ్రాను సౌత్ జోన్ డీసీపీగా నియమించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter