ED Raids Casino Dealers: విదేశాల్లో క్యాసినోల పేరిట ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలతో క్యాసినో నిర్వాహకులైన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ దాడులు నిర్వహించింది. మొత్తం 8 ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. గురువారం (జూలై 28) తెల్లవారుజాము వరకు ఏకధాటిగా 20 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని సైదాబాద్, బోయిన్‌పల్లి, కడ్తల్ ప్రాంతాల్లోని ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈడీ సోదాల సందర్భంగా నేపాల్‌లో ఇటీవల క్యాసినో నిర్వహించినట్లుగా చికోటి ప్రవీణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అతని ల్యాప్‌టాప్ ద్వారా పలు అనుమానాస్పద లావాదేవీల వివరాలను సేకరించినట్లు సమాచారం. హవాలా రూపంలో జరిగిన చెల్లింపులపై ప్రస్తుతం ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో గోవాలోని ఓ క్యాసినోలో టేబుల్ నిర్వాహకుడిగా ఉన్న చికోటి ప్రవీణ్.. ఆ తర్వాత విదేశాల్లో క్యాసినోలతో కోట్లకు పడగలెత్తినట్లు ఈడీ గుర్తించింది.


ఆ ప్రముఖుల్లో కలవరం :


ప్రవీణ్, మాధవరెడ్డి విదేశాల్లో నిర్వహించిన క్యాసినోల్లో టాలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన పలువురు ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈడీ తాజా సోదాలతో ఆ ప్రముఖులు కలవరపడుతున్నట్లు సమాచారం. ఒక్కో విదేశీ క్యాసినో టూర్‌కు ప్రవీణ్, మాధవరెడ్డి రూ.5 లక్షల వరకు వసూలు చేసేవారని ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో శ్రీలంక కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం ప్రస్తుతం నేపాల్ కేంద్రంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రవీణ్, మాధవరెడ్డి ఏపీలోని గుడివాడలోనూ క్యాసినో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.


సినీ సెలబ్రిటీలతో ప్రచారం :


గత నెలలో నేపాల్‌లో నిర్వహించిన క్యాసినో కోసం అమీషా పటేల్, ముమైత్ ఖాన్, ఈషా రెబ్బా, డింపుల్ హయతీ తదితరులతో ప్రవీణ్ వీడియో ప్రమోషన్స్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. తాము ఆ క్యాసినోలో పాల్గొంటున్నట్లు సినీ సెలబ్రిటీలతో చెప్పించడం ద్వారా పంటర్లను ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఇంకా ఎవరెవరున్నారనే దానిపై ఈడీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.


Also Read: Jupiter Retrograde 2022: రేపు గురుడు తిరోగమనం.. 4 నెలల పాటు ఈ రాశులవారిపై ధన వర్షం!


Also Read: WI vs Ind: మూడో వన్డేలో విండీస్ చిత్తు.. 119 పరుగుల తేడాతో టీమిండియా విజయం.. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.