Etela Rajender demands dalita bandhu scheme for all Dalits in Telangana: హుజురాబాద్: దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలు అన్నింటికీ తక్షణమే దళిత బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఆ 10 లక్షల రూపాయలను దళితులు వారి నైపుణ్యానికి, అవసరాలకు అనుగుణంగా  ఖర్చు పెట్టుకొనే స్వేచ్చ కల్పించాలి అని అన్నారు. దళిత బంధు పథకం డబ్బులపై జిల్లా కలెక్టర్, బ్యాంక్ మేనేజర్‌ల అజమాయిషీ, పెత్తనం లేకుండా చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దళిత బంధు పథకం కొందరికే, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు కాని వారికి ఇస్తున్నారనే ఆరోపణలను ఈటల రాజేందర్ ప్రస్తావిస్తూ దళిత బంధు పథకం అందరికీ అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళిత బంధు పథకం ప్రయోజనాలు (Dalita bandhu scheme benefits) అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే నేనే దీక్షకు కూర్చుంటానని స్పష్టంచేసిన ఈటల రాజేందర్ (Etala Rajender).. ప్రభుత్వానికి ఇదే నా హెచ్చరిక అని అన్నారు. 


Also read : RS Praveen Kumar: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కి ఆతిథ్యం ఇవ్వడమే ఆ తహశీల్ధార్ బదిలీకి కారణమా ?


హుజూరాబాబ్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం అమలు తీరుపై ఇప్పటికే పలు చోట్ల దళితులు ఆందోళనలు చేపట్టారు. ఉద్యోగం ఉన్న వాళ్లు, పెన్షన్ తీసుకునే వాళ్లు, భూమి-జాగ ఉన్నవాళ్లకే దళిత బంధు (Dalita bandhu scheme rules) ఇస్తూ ఏమీ లేని మాలాంటి వాళ్ల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని దళితులు పలు చోట్ల ధర్నాలు చేపట్టారు.


Also read : Minister Harish Rao slams Etala Rajender: ఈటల రాజేందర్‌ భాషపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook