Etela Rajender to join BJP: కరీంనగర్‌: ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీసీలను మోసం చేసిన ఈటల రాజేందర్‌కు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన కబ్జా చేసిన నిరుపేదల భూములను బాధితులకు ఇప్పించండి అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్న గంగుల కమలాకర్.. అలా చేయని పక్షంలో ఈటల పాల్పడిన అవినీతికి మీరు కూడా పరోక్షంగా మద్దతు ప్రకటించినట్లే అవుతుందని ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈటల రాజేందర్ ఆత్మగౌరవం (Self respect) పేరు చెప్పుకుని బడుగు బలహీనవర్గాలను మోసం చేస్తున్నారు. ఏడేళ్ల నుంచి గుర్తుకురాని ఆత్మగౌరవం (Aatmagouravam) ఇప్పుడు అవినీతి బయటపడుతుందని గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు బీజేపి ఎలాంటి ఆత్మగౌరవం ఇస్తామని చెప్పిందో ఈటల రాజేందర్ బహిర్గతం చేయాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. గతంలో కారుకు ఓనర్‌ అని ప్రకటించుకున్న నువ్వు ఇప్పుడు బీజేపీలో చేరి ఆ పార్టీకి క్లీనర్‌‌వి అయ్యావా అని ఎద్దేవా చేశారు. 


Also read : Etela Rajender సంచలన వ్యాఖ్యలు, Harish Raoకు సైతం అవమానాలు జరిగాయన్న ఈటల రాజేందర్


గతంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) బొమ్మపైనే గెలిచిన ఈటల రాజేందర్ ఇకపై హుజురాబాద్‌లో ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉంది కాబట్టే ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తూ వచ్చారు కానీ అది ఆయన సొంత బలం కాదని అన్నారు. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో బీజేపికి (BJP about Etela Rajender) ఉన్న ఓట్లు కూడా ఇప్పుడు ఈటల చేరికతో గల్లంతు అవడం ఖాయం అని మంత్రి గంగుల అభిప్రాయపడ్డారు.


Also read : Etela Rajender Resigns to TRS: టీఆర్ఎస్‌కు ఈటల రాజేందర్ రాజీనామా, 19 ఏళ్ల బంధానికి స్వస్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook