MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కేసీఆర్ కీలక పోస్ట్.. కూతురికి గులాబీ బాస్ బంపర్ గిఫ్ట్..!
Ex CM KCR: బీఆర్ఎస్ మహిళా లీడర్లలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందా..! ఆరు నెలలుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పోస్టును గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు భర్తీ చేయడం లేదు..! ఇటీవల మంత్రి కొండా సురేఖకు ఎపిసోడ్లో గట్టిగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పార్టీలో చర్చ జరుగుతోందా..! ప్రస్తుత తరుణంలో రాష్ట్ర మహిళా చీఫ్ పోస్టు భర్తీ అనివార్యమని నేతలు భావిస్తున్నారా..! మరి ఈ విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది..!
Ex CM KCR: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా డీలా పడింది. గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం, పార్టీలో కొందరు నేతలు అధికార పార్టీలో చేరిపోవడంతో పార్టీలో కొంత స్తబ్ధత నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవిని ఎవరికి కేటాయించకపోవడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందట.. రాష్ట్ర మహిళా చీఫ్ పదవి ఖాళీ అయ్యి దాదాపు ఆరు నెలలు దాటింది. ఆ పదవికి గుండు సుధారాణి రాజీనామా చేశాక.. ఎవరికి అప్పగించ లేదు. కొద్దిరోజులుగా ఆ పదవి దక్కించుకునేందుకు కొందరు మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. గప్‌చుప్ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్.. ఆ మంత్రి సపోర్ట్‌తోనే..!
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి దాదాపు 60 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎక్కువ సంఖ్యలోనూ మహిళా లీడర్లు పార్టీలో కొనసాగుతున్నారు. కానీ పదవుల విషయంలో మాత్రం మహిళా నేతలను కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర మహిళా చీఫ్ పోస్టు ఖాళీ అయ్యి ఆరునెలలు దాటినా ఆ పదవిని గులాబీ బాస్ ఎవరికి కేటాయించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీలో కొండా సురేఖ ఏపిసోడ్ కలకలం రేపింది. మంత్రి కేటీఆర్ కొండా సురేఖ కామెంట్స్‌తో బీఆర్‌ఎస్ పార్టీ డిఫెన్స్ పడింది. అయితే కొండా సురేఖ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ధీటైన జవాబు ఇవ్వలేదనే చర్చ పార్టీలో జరిగిందట.. మహిళల అంశం కావడంతో మహిళా లీడర్ల చేత అధికార పార్టీకి మరింత ఇబ్బంది పెట్టి ఉంటే పార్టీకి మరింత లాభం జరిగి ఉండేదని పార్టీ హైకమాండ్ భావించిందట. అయితే ఈ సమయంలో కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి కొండా సురేఖను టార్గెట్ చేసి ఉంటే మరింత బాగుండేదని పార్టీలో కొందరు నేతల అభిప్రాయంగా తెలిసింది. కానీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు కావడం.. జైలు నుంచి బయటకు రావడం జరిగాయి.. అయితే తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక కవిత ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం లేదు.. పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్న సమయంలో కవిత మంచి వాగ్ధాటి అనే గుర్తింపు పొందారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత బయటకు రావాలనే చర్చ సైతం పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇక రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారెంటీల అమలు కోసం కృషి చేస్తోంది. ఇందులో కొన్ని గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేస్తోంది. కానీ మహాలక్ష్మి పథకం ఇప్పటివరకు అమలు కాలేదు.. ఈ విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన మహిళా లీడర్ లేడనే చర్చ పార్టీలో జరుగుతోందట. చాలా విషయాల్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రస్తావిస్తున్నారు. కానీ అధికార పార్టీని ఇరుకున పెట్టాల్సిన మహిళా అంశాలపైన ఈ ఇద్దరు కానిచ్చేస్తున్నారని వాదన ఉంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొందరు మహిళా ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ వారిపై కూడా కారు పార్టీ అనేక ఆంక్షలు పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే చాలామంది మహిళా లీడర్లు నేరుగా మీడియాను అడ్రెస్ చేయలేకపోతున్నారట..
మరోవైపు హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్‌లో ప్రకంపనలు రేపాయి.. ప్రభుత్వ చర్యను మూసీ బాధితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో మీడియా ముందుకు ఎక్కువ మంది మహిళలు వచ్చి ఆందోళనలకు దిగారు. అయితే మూసీ బాధితులను పరామర్శకు బీఆర్‌ఎస్ అగ్రనేతలు వెళ్లినా మహిళలతో ఇంకా లోతుగా మాట్లాడించలేదని చర్చ నడుస్తోందట. ఇదే స్థానంలో మహిళా లీడర్ ఉండుంటే .. పార్టీకి మరింత లాభం జరిగి ఉండేదని చెబుతున్నారు.. అయితే బీఆర్‌ఎస్ అధిష్టానం మాత్రం పార్టీలో మహిళలకు తొలినుంచి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇందుకు ఉదహరణ.. కేసీఆర్ తొలి ఐదేళ్ల పాలనలో ఒక్కరంటే ఒక్కరు మహిళా మంత్రిని నియమించలేదు. అప్పట్లో ఈ విషయమై ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేయడంతో రెండో టర్మ్‌లో మహిళా మంత్రులకు అవకాశం కల్పించారు. అందుకే బీఆర్ఎస్ మహిళా లీడర్లను కేసీఆర్ పట్టించుకోవడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.. ప్రస్తుతం బీఆర్‌ఎస్ మహిళా అధ్య క్షురాలు తన పదవికి రాజీనామా చేసి ఆరు నెలలు గడిచినా.. కొత్త వారికి అవకాశం కల్పించలేదని చెబుతున్నారు..
ఏదీఏమైనా బీఆర్‌ఎస్ పార్టీలో మహిళా చీఫ్ లేదనే వాదన రోజురోజుకు బలపడుతోంది. ఇప్పటికైనా గులాబీ బాస్ కేసీఆర్.. మహిళా చీఫ్ పదవిని పార్టీలో కీలకంగా ఉన్న మహిళా నేతలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. చూడాలి మరి మహిళా నేతల ఆవేదనను అర్థం చేసుకుని గులాబీ బాస్ పదవిని ఎవరికైనా అప్పగిస్తారా..! లేదంటే తన మార్క్ రాజకీయం చేసుకుంటూ వెళ్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
Also Read: KTR Celebrations: దీపావళి వేళ సంబరాలకు కేటీఆర్ పిలుపు.. ఎందుకు? ఏం సాధించారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook