Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ దక్కని నేతలు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నాయకులు ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌కు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి షాకిచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాగర్ కర్నూల్‌ టికెట్‌ను నాగం ఆశించగా.. కాంగ్రెస్ అధిష్టానం మరొకరికి కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి వెళ్లి.. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు నాగం జనార్థన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఔన్నత్యాన్ని పెంచేందుకు తాను ఎంతో కృష్టి చేశానని.. తనకు టికెట్‌ ఇవ్వకుండా ఇలా మోసం చేస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరగవుతున్న తరుణంలో తాను ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి.. పార్టీ బతికించానని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం ఇంత చేసినా.. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం కష్టపడిన చేసిన వారికి అన్యాయం జరిగిందని.. ఇతరులకు టికెట్లు కేటాయించడం బాధగా ఉందని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించారు. 


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read: Kerala Blast: కేరళలో భారీ పేలుడు, ఒకరి మృతి, 40 మందికి గాయాలు, రాష్ట్రమంతటా అలర్ట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook