Family suicide along with two children in sangareddy district : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్ల ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. బిజినెస్‌లో లాస్ రావడంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య కలహాలు ఏర్పడ్డాయి. దీంతో భ‌ర్త ఇంట్లో ఉరేసుకున్నారు. భార్య త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కలసి చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) మునిప‌ల్లి మండ‌లం గార్ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన చంద్ర‌కాంత్, లావ‌ణ్య దంప‌తులు హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్‌లో (BHEL) ఉండేవారు. వీరికి ఎనిమిదేళ్ల బాబు.. ప్ర‌థ‌మ్‌, మూడు సంవత్సరాల పాప స‌ర్వ‌జ్ఞ‌ అనే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. చంద్ర‌కాంత్ (Chandrakant)కు ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) తలెత్తాయి. దీంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య కలహాలు ఏర్పడ్డాయి. తరచూ వాగ్విదాలు జరిగేవి.


చంద్రకాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసేవారు. అయితే బీహెచ్‌ఈఎల్‌లో ప్రస్తుతం నివాసం ఉండే వీరు బాంబే కాలనీలో కొత్తగా ఇంటిని కట్టుకుంటున్నారు. ఇందుకోసం లావణ్య తల్లిదండ్రులు దాదాపు 40లక్షల దాకా సాయం చేశారు. అయితే చంద్రకాంత్‌ కు వచ్చే శాలరీ అంతా కూడా ఇంటి నిర్మాణానికే సరిపోతుండడంతో ఇల్లు గడవడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో సాయం చేయాలంటూ తన తల్లిదండ్రులను చంద్రకాంత్‌ కోరాడు. వారు నిరాకరించారు. తాజాగా చంద్రకాంత్ తన తల్లిదండ్రులతో డబ్బు విషయంలో తగాదపడ్డాడు. ఇక రోజూ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపం  చెందిన లావణ్య.. పిల్లలతో పాటు ఇంటి నుంచి వెళ్లిపోయింది.


అయితే ఇంటి నుంచి భార్యాపిల్ల‌లు వెళ్లిపోవ‌డం, ఆర్థిక ఇబ్బందుల సమస్య, అలాగే అప్పటికే గొడవ జరగడంతో చంద్ర‌కాంత్ మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్యకు (Suicide) పాల్పడ్డాడు. 


Also Read : DHEE 13 Grand Finale : ఢీ-13 గ్రాండ్‌ ఫినాలేలో బన్నీ పంచుల వర్షం..లేటేస్ట్ ప్రోమో అదిరిపోయింది


చంద్ర‌కాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ విషయాన్ని లావ‌ణ్య‌కు (Lavanya) ప‌క్కింటి వాళ్లు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో లావ‌ణ్య కూడా వెంటే త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఆందోళ్ పెద్ద చెరువులోకి తోసేసి, తాను కూడా ఆత్మ‌హ‌త్యకు పాల్పడింది.శుక్ర‌వారం ఉద‌యం ఆందోళ్ పెద్ద చెరువులో మృత‌దేహాలను  గుర్తించారు. స్థానికుల సమచారంతో ఘటన స్థలానికి పోలీసులు (Police) చేరుకుని.. మొదట త‌ల్లీ కుమారుడి డెడ్ బాడీలు బ‌య‌ట‌కు తీశారు. వారి మూడేళ్ల పాప కూడా త‌ల్లితోనే ఉంద‌ని బంధువులు చెప్ప‌డంతో.. గ‌జ ఈత‌గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పాప మృత‌దేహాన్ని (Dead body) వెలికి తీశారు. ఆ ముగ్గురి డెడ్ బాడీలు పోస్టుమార్టం కోసం జోగిపేట ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు (Police) ద‌ర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


Also Read : Omicron scare: ముంబయి ఎయిర్​పోర్ట్​లో 9 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook