Family suicide attempt at pragathi bhavan: హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద తీవ్ర కలకలం రేగింది. శనివారం (డిసెంబర్ 18) ఉదయం ఓ కుటుంబం క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ముగ్గురు పిల్లలతో అక్కడికి వచ్చిన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఆ కుటుంబం ప్రాణాలు కాపాడినట్లయింది. ఆత్మహత్యకు యత్నించిన ఆ కుటుంబాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకి చెందినవారిగా గుర్తించారు. తమ ఐదెకరాల భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని... తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రగతి భవన్ ఎదుట గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లక్ష్మణ్ అనే ఓ టీఆర్ఎస్ కార్యకర్త ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే ఏడాది జూన్‌లో ఇద్దరు అన్నాదమ్ములు ప్రగతి భవన్‌ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. ఓ భూ వివాదానికి సంబంధించి పేట్ బషీరాబాద్ సీఐ తమను వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యకు యత్నించారు.


గతంలో చందర్ అనే ఓ ఆటో డ్రైవర్ తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరుతూ ప్రగతి భవన్ (Pragathi Bhavan) ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ప్రగతి భవన్ ఎదుట ఇలాంటి తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.


Also Read: Ananya Pandey Trolling Pics: అనన్య పాండే హాట్ పిక్స్ పై ట్రోలింగ్.. ఫొటోలు వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook