kandikonda yadagiri's death news: ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి ఇక లేరు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ.. ఆ వ్యాధితోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్, మోతి నగర్‌లోని సాయి శ్రీనివాస్ టవర్స్‌లో నివాసం ఉంటున్న కందికొండ యాదగిరి.. అదే ప్లాట్‌లో కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధికి కీమో థెరపీ చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. గత ఎనిమిది నెలలుగా దాదాపు మంచానికే పరిమితమైన కందికొండ.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆ ప్రభావంతోనే తుది శ్వాస విడిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కందికొండ పూర్తి పేరు కందికొండ యాదగిరి అయినప్పటికీ.. అటు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులతో పాటు ఇటు అభిమానులకు సైతం ఆయన కందికొండగానే సుపరిచితం. ఓవైపు సినిమాలకు పాటలు రాయడంతో పాటు తెలంగాణ నేపథ్యంతో తెలంగాణ యాసలో పాటలు రాయడంలో కందికొండది అందెవేసిన చెయ్యి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగులపల్లె గ్రామానికి చెందిన కందికొండ.. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో మళ్లీ కూయవే గువ్వా పాటతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. 


ఆ తర్వాత అదే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన పోకిరి సినిమాలో గల గల పారుతున్న సెలయేరులా సాంగ్‌కి సైతం కందికొండ లిరిక్స్ అందించారు. ఇడియట్ సినిమాలో చూపుల్తో గుచ్చి గుచ్చి పాట సైతం కందికొండ రాసిందే. అలా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన పలు చిత్రాలకు కందికొండ లిరిక్స్ అందించారు. శ్రీకాంత్ నటించిన కోతల రాయుడు చిత్రం కందికొండ ఆఖరి చిత్రం. తెలుగు సినిమాలతో పాటు తెలంగాణ యాసలోనూ తెలంగాణ నేపథ్యం ఉట్టిపడేలా పలు ప్రైవేటు ఆల్బమ్స్‌కి కందికొండ లిరిక్స్ అందించారు. తెలంగాణ సాహిత్యం, మాండలికం, యాసపై పట్టున్న కందికొండకు అదే కళ ఆయనకు గేయ రచయితగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.


Also read : Crime News: థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించిన‌ బ‌య్యారం ఎస్సై ర‌మాదేవి.. నడవలేని స్థితిలో నిందితుడు!!


Also read : Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖుల బాగోతాలు బయటపడతాయంటున్న రేవంత్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook