హైదరాబాద్: దేశంలోనే అత్యధిక సంఖ్యలో 185 నామినేషన్స్‌తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన లోక్ సభ నియోజకవర్గంగా నిజామాబాద్ పతాక శీర్షికల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలు చేసిన పసుపు, ఎర్ర జొన్న రైతులు తాజాగా నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాల్సిందిగా కోరుతూ తెలంగాణ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలను వాయిదా వేసి బ్యాలెట్ పేపర్స్ పద్దతి ద్వారానే ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని రైతులు తమ పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తిచేశారు. 


రైతుల పిటిషన్‌ మధ్యాహ్నం తర్వాత విచారణకు రానున్న నేపథ్యంలో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ పరిస్థితి ఏంటా అనే ఉత్కంఠపూరిత వాతావరణం కనిపిస్తోంది.