Ram Lakshman: బండరాళ్ల మధ్య ఇరుక్కున్న బాలింతను కాపాడిన రామ్- లక్ష్మణ్ మాస్టర్లు.. వీడియో వైరల్
Ram Lakshman: వెండితెరపై వాళ్ళిద్దరూ ఫైట్ మాస్టర్లు... కానీ నిజ జీవితంలో మాత్రం సూపర్ హీరోలుగా నిలిచిపోయారు... వారు ఎవరో కాదు ఫైట్ మాస్టర్ ట్విన్ బ్రదర్స్ రామ్ లక్ష్మణులు.. వారిద్దరూ చేసిన ఒక పని సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చేసిన పని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రామ లక్ష్మణ్ మాస్టర్లు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం.
Ram Lakshman: మొయినాబాద్ లోని అజీజ్ నగర్ సమీపంలో షూటింగ్ నిర్వహిస్తుండగా దూరంగా ఒక పెద్ద బండరాళ్ల గుట్ట మధ్య నుంచి ఓ కుక్క అరుపు వినిపించింది. దాని బాధ హృదయ విదారకంగా ఉంది. ఆ రాళ్లగుట్ట పక్కనే సమీపంలో పది కుక్కపిల్లలు తల్లిపాల కోసం అగచాట్లు పడుతున్నాయి. మరోవైపు తల్లి శునకం ఆ రాళ్లగుట్ట నుంచి బయటకు వచ్చి పిల్లలకు పాలు ఎలా ఇవ్వాలో తెలియక సతమతం అవుతోంది. దాని ముఖంపై రక్తంతో గాయాలు అయినప్పటికీ, ఎలాగైనా బయటకు రావాలని ప్రయత్నం చేస్తుంది.
ఇది గమనించిన మాస్టర్లు వెంటనే రంగంలోకి దిగారు. తమ వెంట ఉన్న ఫైటర్లను పిలిపించి ఆ రాళ్లగుట్టను కలిపి తల్లి కుక్కను ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీయాలని ఆదేశించారు. ఎందుకు తగ్గ ప్లానింగ్ వెంటనే అమలు చేశారు ఒక పెద్ద జెసిబి ని తెప్పించి బండరాళ్లను జాగ్రత్తగా కలిపి, తల్లి శనకంకు గాయం కాకుండా దాని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడారు.
తల్లి శునకంను బయటకు తీసిన వెంటనే దాన్ని నేరుగా కుక్క పిల్లల వైపు తీసుకెళ్లగా ఆ పసికూనలు చనుబాలను తాగి ప్రాణం నిలుపుకున్నాయి. ఈ మొత్తం ఘటనను వీడియోగా మలిచి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు సోషల్ మీడియాకు విడుదల చేశారు. మన చుట్టూ ఉన్న జంతు జీవుల పట్ల జాలి దయ కలిగి ఉండాలని అప్పుడే ప్రకృతి మనల్ని చల్లగా చూస్తుందని ఈ సందర్భంగా వారిద్దరూ పేర్కొన్నారు.
Also Read: Health Tips: సడెన్‌గా బీపీ డౌన్ అయ్యిందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే నార్మల్ అవుతుంది
దిలా ఉంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవనానికి అలవాటు పడ్డారు. న్యూ ఎనర్జీ పద్ధతి ద్వారా యోగా సాధన చేస్తూ, పిరమిడ్ ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు. పూర్తిగా శాకాహారులుగా మారిన రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, తమ జీవితంలో కలిగిన మార్పు గురించి ఇప్పటికే పలు వీడియోల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ మాస్టర్లు ప్యాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలకు చెందిన సినిమాలకు ఫైట్ మాస్టర్ గా రాణిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter