హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు నిర్వహించనున్న ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల దాఖలుకు గడువు (జనవరి 10న) ముగిసింది. మొత్తం నాలుగు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. రేపు ఎన్నికల కమిషన్ నామినేషన్లను పరిశీలిస్తారు. జనవరి 22వ తేదీన పోలింగ్‌, 25న కౌంటింగ్‌ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అభ్యర్థులకు వీలుంటుంది. అయితే దాదాపు 10వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పోటీలో ఉంటే ఏ-ఫారాలు అందజేశారని, బీ ఫారాలను కూడా అందజేయాలని ఎన్నికల అధికారులు అభ్యర్థులకు సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. 


9 కార్పొరేషన్లలోని 325 డివిజన్లలో 2 వేల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డులకు 10 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో వార్డుకు సగటున 5 మంది నుంచి నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఉపసంహరణ గడువు ముగిసే (ఈ 14న మధ్యాహ్నం 3 గంటలు) వరకు బీ-ఫారాలు ఇవ్వొచ్చని ఈసీ స్పష్టం చేసింది.


  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..