Gandhi hospital Fire accident: హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో ఉన్న విద్యుత్ ప్యానెల్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడి 5వ అంతస్తు వరకు పొగ అలుముకోవడంతో ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ ఆస్పత్రి సిబ్బంది, రోగులు (Gandhi hospital patients) హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనపై అగ్నిమాపక శాఖ (Fire dept) సిబ్బంది స్పందిస్తూ.. ''స్వల్ప అగ్ని ప్రమాదమేనని, సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం తీవ్రత పెరగకుండా మంటలు ఆర్పేయగలిగాం'' అని అన్నారు.


Also read : TS Inter exams 2021: ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్.. డౌన్‌లోడ్ కోసం tsbie.cgg.gov.in


గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో (Gandhi hospital fire accident) ఆస్పత్రి సిబ్బంది సైతం ఫైర్ ఎక్స్‌టింగ్విషర్స్ సహాయంతో మంటలు ఆర్పేందుకు కృషి చేశారని, కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయంలో సిబ్బందికి ఇచ్చిన శిక్షణ ఈరోజు కొంత ఉపయోగపడిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు (Gandhi hospital superintendent Raja Rao) అన్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరలోనే ఆస్పత్రిలో (Gandhi hospital) విద్యుత్ పునరుద్ధరణకు కృషిచేస్తామని తెలిపారు.


Also read : Vaccination Mistakes in Telangana: 2 నెలల కింద చనిపోయిన వ్యక్తికి ఈ నెల 12 న టీకా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook