నేను గనుక రంగంలోకి దిగితే వార్ వన్ సైడే...ఇంది లెజెండ్ సినిమాలోని ​బాలకృష్ణ పంచ్ డైలాగ్ అనుకునేరు.. అమిస్తాపూర్ తాజా మాజీ గ్రామ సర్పంచ్ వీరస్వామి చెబుతున్న మాటలు ఇవి..42 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్న వీరస్వామి గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో ఇప్పుడు జనాల దృష్టి అంతా గ్రామ పోరుపై పడింది. ఈ సందర్భంలో  గ్రామ పంచాయితీ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబర్ నగర్ జిల్లా భూత్పూరు మండలం అమిస్తాపూర్ గ్రామ పంచాయితీకి  42  ఏళ్లుగా  అతనే సర్పంచ్..ఎప్పుడు ఎన్నికలు జరిగిన వార్ వన్ సైడే.. ఎన్నికల జరిగిన ప్రతీసారీ  వీర స్వామి ఏకగ్రీవమే.. ప్రస్తుత ఆయన వయస్సు 70 ఏళ్లు.


రోజులు మారాయ్.. నాల్గు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాన్ని ఏలుతున్న వీరస్వామి ఈ సారి పోటీ ఎదుర్కొంటున్నారు. 42 ఏళ్ల తర్వాత బ్యాలెట్ బాక్స్ లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఆయనకు పోటీగా నిలబడటంతో ఈ పోటీ అనివార్యమైంది. ఈ సందర్భంగా వీర స్వామి మాట్లాడుతూ గ్రామ సమస్యలను తీర్చడం ఒక బాధ్యతగా తీసుకోవడం వల్లే స్థానిక ప్రజలను తనను ఎప్పూడూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చారని..ఈ సారి ఏకగ్రీవం కాకపోయినా భయపడేది లేదని..ప్రజల తనవైపే ఉన్నారని వీర స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఏడు పదుల వయసులో కూడా పోటీకి సై అంటూ చెబుతూ ..వార్ వన్ సైడ్  అంటున్నారు వీరస్వామి.