Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అత్యక్రియలు (Konijeti Rosaiah last rites) ముగిశాయి. కొంపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన భౌతిక దేహానికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛానలతో అంత్యక్రియలను (Rosaiah funerals) నిర్వహించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోశయ్య అంత్యక్రియలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతా రెడ్డి, శ్రీధర్ బాబు, వి.హనుమంత రావు హాజరయ్యారు. ఇతర పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు కూడా రోశయ్యకు తుది వీడ్కోలు పలికారు.


నిన్న తుది శ్వాస విచిన రోశయ్య..


గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్యకు నిన్న తీవ్ర అశ్వస్థకు గురయ్యారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


కొణిజేటీ రోశయ్య 1933 జులై 4న గుంటూరులోని వేమురులో జన్మించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు.


రోశయ్య భౌతిక దేహాన్ని నిన్న అమీర్​ పేట్​లోని ఆయన స్వగృహంలో ఉంచగా.. నేడు ఉదయం గాంధీ భవన్​కు తరలించారు. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు చివరి చూపు చూసేందుకు అవకాశం కల్పించారు. అనంతరం ఈ మధ్యాహ్నం గాంధీ భవన్​ నుంచి నేరుగా కొంపల్లి ఫామ్​ హౌస్​కు తరలించారు. అక్కడే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


Also read: Konijeti Rosaiah: ఆంధ్రా రాజకీయాల్లో రోశయ్య చెరగని ముద్ర- ఆయన ప్రస్థానం..


Also read: Konijeti Rosaiah Death : రోశయ్య ఒక యోగిలా ప్రజాసేవ చేశారన్న చిరంజీవి, బాలకృష్ణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook