Former Jubilee Hills MLA Send's His Daughter to School with Band Baaja: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏవేవో వీడియోలు వైరల్ అవుతుంటాయి. డిఫరెంట్ గా ఉన్న వీడియోలు మాత్రం ఇట్టే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే.. కన్న తండ్రి తన కూతురుని భాజా భాజంత్రీలతో స్కూల్ కి పంపటం.. అది కూడా జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అవటంతో అది కాస్త మరింత వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటి ముందు కొత్త కారు రెడీగా ఉంది. ఇంటి ముందు మేళం వాయించే వాళ్లు ఉన్నారు. ఇంట్లో బ్యాండ్ మ్రోగుతుంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో పెళ్లి ఫంక్షన్ ఏమీ జరగడం లేదు.. ఎందుకంటే ఆయనకు పెళ్ళికి ఎదిగిన కుమార్తె లేదు. కేవలం 8వ తరగతి చదువుతున్న కూతురు జనశ్రీ రెడ్డి ఉంది. ఆమె చిరేక్ ఇంటర్నేషన్‌ స్కూల్‌ లో చదువుతోంది.  
మరి ఎందుకు ఈ తతంగం అనుకుంటున్నారా..? విశేషం ఉందండి. 


జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కూతురు కరోనా కారణంగా స్కూల్ కి వెళ్లక దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది, అయితే జన శ్రీ కరోనావెలుగులోకి వచ్చిన తర్వాత స్కూల్ కి వెళ్ళింది లేదు. కాగా ఇంట్లో ఉంటూనే 6 వ తరగతి, 7వ తరగతి పూర్తీ చేసింది. ఇప్పుడు 8వ తరగతిలోకి అడుగు పెట్టగా.. కరోనా పూర్తిగా తగ్గడంతో మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యాయి.



అయితే రెండేళ్లుగా స్కూల్ కు వెళ్లే అలవాటు తప్పింది. యధావిధిగా స్కూల్ కి వేళ్లను అంటుందేమో అన్న భావనతో మన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కొంచెం డిఫెరెంట్ గా ఆలోచించి..  బ్యాండు మేళాల మధ్య కొత్త కారులో స్కూలుకు సాగనంపారు. 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఎమ్మెల్యే ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కన్న కూతురిని ని బ్యాండ్ బాజా తో సాగనంపిన తండ్రి ప్రేమకు ఫిదా కానివారుంటారా చెప్పండి. 


Also Read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్స్! అభిమానులకు పూనకాలే ఇగ!!


Also Read: పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోసం మంత్రుల పడిగాపులు.. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ ఖారారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook