Former Minister Harish Rao Wears TRS Scarf: ఎప్పుడూ బీఆర్ఎస్ కండువాతో  ఉండే హరీష్ రావు.. ఎందుకు పాత కండువా కప్పుకున్నట్లు..? కండువా మార్పు వెనుక యాధృచ్చికమా..? లేక పొరపాటా..? అనే చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హరీష్‌ రావు కండువా మార్పు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందరూ అనుకుంటున్నట్లు బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారబోతుందా.. హరీష్‌ రావు అదే విషయాన్ని చెప్పదలుచుకున్నారా అని చర్చించుకుంటున్నారు. హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా స్పష్టంగా కనపడేలా ప్లాన్ చేశారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు టీఆర్ఎస్ కండువా అలాగానే ఉంది. అక్కడ ఉన్న ముఖ్య నేతలు సైతం గుర్తించిన చూసీ చూడనట్లు ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా పడిన రైలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్  పార్టీ ముఖ్య నేతలకు ఈ విషయం ముందుగానే స్పష్టం చేసిందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న మర్మం ఇదేనా..? అనేది తెలియాల్సి ఉంది. గతంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారింది. కానీ గులాబీ బాస్ కేసీఆర్ అనుకున్నదొక్కటి అయితే అయ్యింది మరొకటి. దేశ రాజకీయాలు పక్కన పెట్టి పార్టీ పుట్టిన తెలంగాణలోనే ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో తిరిగి పార్టీనీ టీఆర్ఎస్‌గా మార్చలనే డిమాండ్ పార్టీలో తీవ్రమైంది.


పార్టీలోని ముఖ్య నేతలతో సహా పార్టీలోని జిల్లా స్థాయి నేతలు సైతం  పలు సందర్భాల్లో ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ నాటి నుంచి పార్టీ పేరు మార్పుపై రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై కేసీఆర్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ పేరు మార్చడానికి ఏదైనా న్యాయపరమైన అడ్డంకులు వస్తాయా..? ఒక వేళ పార్టీ పేరు మారితే ఇప్పుడున్న కారు గుర్తే ఉంటదా..? లేదా అనే సందేహాలు బీఆర్ఎస్‌లో కలుగుతున్నాయి.


దీనిపై ఒక క్లారిటీ కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలో మాజీ ఎన్నికల అధికారులు, సీనియర్ న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా పార్టీ మార్పుపై ఒక నిర్ణయానికి వచ్చిన గులాబీ అధిష్టానం టీఆర్ఎస్‌గా మార్చడాని సిద్దమైనట్లు తెలిసింది. పార్టీ మార్పుపై బీఆర్ఎస్ అధిష్టానానికి ఒక స్పష్టత రావడంతోనే హరీష్‌ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్లు చర్చించుకుంటున్నారు. పార్టీలో ఒక వైపు వలసలు కొనసాగుతన్న వేళ పార్టీలో ఉద్యమం నాటి నుంచి ఉన్న నేతలకు భరోసా ఇచ్చేందుకే ఇలా చేసి ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Also Read: Amrit Vrishti: SBI నుంచి బంపర్ స్కీం.. 5 లక్షల డిపాజిట్‌పై ఎంత రాబడి వస్తుందంటే.!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి