Ponguleti Srinivas Reddy Meeting with BJP Leaders: బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కీలక నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పొంగులేటితో గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మరో కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు. బీజేపీలో చేరికపై మంతనాలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి రావాలని కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులు తమ నివాసానికి వచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని అనుకున్నామని.. కానీ సీఎం కేసీఆర్ ఈ అంశాలను తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. బీజేపీ చేరీకల కమిటీ  తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని.. గతంలో.. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పార్టీలోకి రావాలని కోరారని చెప్పారు. తాము రాష్ట్ర ప్రజల కోసమే పార్టీ వీడామని.. ప్రజల ఆశయాలను నెరవేర్చే క్రమంలోనే తాము తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉంటాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను మూడోసారి అధికార చేపట్టకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. 


'సీఎం కేసీఆర్‌ ను గద్దె దించేందుకు శక్తి ఉన్న పార్టీకి మేము మద్దతుగా ఉంటాం.. యావత్ తెలంగాణ బిడ్డల ఆలోచనలకు అనుగుణంగానే పార్టీలో చేరుతాం.. ఎవరో ఏదో అంటుంటారు వారు అధికారంలో ఉన్నారు కదా అని ఎగురుతున్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆయనపై పోటీకి నేను సిద్ధం.. మా అజెండా ఒక్కటే సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపడమే.. దాని కోసమే మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.. ఇదే విషయాన్ని అనేకసార్లు చెప్పాను. బీజేపీ నేతలతో సమావేశం సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పాను..' అని పొంగులేటి తెలిపారు. బీజేపీలో చేరికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. చాలా మందితో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ప్రయత్నిస్తామని వెల్లడించారు.  


మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ప్రస్తావించిన అంశాలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. తాము బీఆర్ఎస్ పార్టీకు వ్యతిరేకంగా పని చేస్తామని స్పష్టం చేశారు. మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం చేపట్టే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యమకారులు, సబ్బండ వర్ణాల వారిని సంఘటితం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామన్నారు. తమ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీనీ గద్దె దించడమేనని అన్నారు.


Also Read: Delhi BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!  


Also Read: Minister Harish Rao: తెలంగాణలో గవర్నర్ పోటీ చేయొచ్చు.. సిద్దిపేట నుంచి పోటీ చేసిన ఒకే: మంత్రి హరీష్‌ రావు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook