GHMC Election Code: కొరడా ఝులిపించిన ఎన్నికల కమీషన్, 4 వేల బ్యానర్ల తొలగింపు
గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చింది. ఎన్నికల ఆంక్షల్లో భాగంగా పోస్టర్లు , బ్యానర్ల తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. నియమావళి అమలైన కొద్ది గంటల్లోనే 4 వేల పోస్టర్లను తొలగించారు అధికారులు.
గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చింది. ఎన్నికల ఆంక్షల్లో భాగంగా పోస్టర్లు , బ్యానర్ల తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. నియమావళి అమలైన కొద్ది గంటల్లోనే 4 వేల పోస్టర్లను తొలగించారు అధికారులు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( Greater Hyderabad Municipal Corporation ) ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ ఉదయం వెలువడింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 4 న కౌంటింగ్ చేపడుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. రీ పోలింగ్ అవసరమైతే..డిసెంబర్ 3న నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 6 లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. నామినేషన్లు ఈ నెల 18 నుంచి ప్రారంభమై...20న ముగియనున్నాయి. స్క్రూటినీ నవంబర్ 21న జరగనుంది. ఉపసంహరణకు ఆఖరు తేదీ నవంబర్ 22.
ఎన్నికల ప్రకటన ( GHMC Notification )వెలువడగానే ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చేసింది. కోడ్ లో భాగంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో 4 వేలకు పైగా పోస్టర్లు , బ్యానర్లను తొలగించినట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసే నోడల్ అధికారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు.
కోడ్ ( Election Code ) అమలైన వెంటనే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎన్నికల ప్రత్యేక అధికారి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహారీ గోడలు, ప్రధాన రహదారులపై ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ఇవాళ తొలగించామని చెప్పారు. నగరంలో కోడ్ పటిష్టంగా అమలు చేసేందుకు సర్కిల్స్ గా నిఘా బృందాల్ని నియమించినట్టు తెలిపారు. Also read: GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన