Gaddar Meets Amit Shah: ఒకప్పుడు తన గళంతో విప్లవ భావజాలాన్ని వ్యాప్తి చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్... కొన్నేళ్ల క్రితం విప్లవోద్యమాన్ని వీడి ఎర్రజెండా స్థానంలో బౌద్ధ పంచశీల జెండా పట్టుకున్నారు. విప్లవాన్ని వీడుతున్నట్లు ఆయన చేసిన ప్రకటన.. ఆ తర్వాత ఆయనలో కనిపిస్తున్న మార్పులు ఒకప్పుడు ఆయన్ను విపరీతంగా అభిమానించినవారి హృదయాలను గాయపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆయన పోకడలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. తాజాగా గద్దర్ బీజేపీ బహిరంగ సభలో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో గద్దర్ ప్రత్యక్షమయ్యారు. తుక్కుగూడలో జరిగిన ఈ సభలో గద్దర్ గంట పాటు ఉన్నారు. సభ అనంతరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు ఒక వినతిపత్రం అందజేశారు. ఆ సమయంలో బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితర నేతలు గద్దర్‌తో ఉన్నారు. విప్లవోద్యమంలో వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా గద్దర్ తన వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 


వయసు రీత్యా తనపై ఉన్న కేసులతో గద్దర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేసుల ఉపసంహరణ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తనపై కేసులు ఎత్తేయాలని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా విజ్ఞప్తి చేశారు. గతంలో ఓ సందర్భంలో కిషన్ రెడ్డిని కలిసి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా కోరారు. ఇదే క్రమంలో తాజాగా బీజేపీ నేతల చొరవతో అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది.


ఇటీవలి కాలంలో గద్దర్ అన్ని పార్టీల నేతలను కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వరి ధాన్యం కొనాల్సిందేనంటూ గత నెలలో టీఆర్ఎస్ చేపట్టిన దీక్షలో గద్దర్ పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో ఆయన్ను కలిశారు. తాజాగా బీజేపీ సభలో ప్రత్యక్షమయ్యారు. ఈ పరిణామాలతో గద్దర్ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 


Also Read: Andrew Symonds Died: ఆస్ట్రేలియా క్రికెట్ లో వరుస విషాదాలు.. కారు ప్రమాదంలో చనిపోయిన ఆండ్రూ సైమండ్స్


Also Read: Pregnant Woman Walks 65km: నిండు గర్భిణి.. రాత్రనక, పగలనక 65 కి.మీ కాలి నడక.. గుండె తరుక్కుపోయే ఘటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.