ఇటీవలికాలంలో గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి సీటు కోసమే గద్దర్ కాంగ్రెస్ గడప తొక్కినట్లు వార్తలు వినిపించాయి. దీనిపై గద్దర్ స్పందిస్తూ తాను కలిసింది సీటు కోసం కాదని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను కలిశారని చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మతతత్వ వ్యతిరేక శక్తులతో కలుస్తా..


ఓ ప్రముఖ మీడియా ఇంటర్యూలో గద్దర్ మాట్లాడుతూ మోడీ హయంలో భారత్ దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని.. ప్రజాస్యామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీతో చేయికలిపానని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబుతో సహా ఎవరినైనా కలుస్తానన్నారు. మతవాదశక్తులకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి కార్యక్రమాల్లో అయినా తాను పాల్గొంటానని..ఇది తమ ధర్మమని గద్దర్ పేర్కొన్నారు.