Ganesh immersion 2022: గణేష్ నిమజ్జనం అనగానే దేశంలో ఇప్పుడు హైదరాబాదే గుర్తుకు వస్తుంది. భాగ్యనగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. ప్రతి ఏటా ఇది మరింత ఘనంగా జరుగుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనోత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ ఏడాది కూడా గణేష్ నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం ముస్తాబైంది. శుక్రవారం జరగనున్న గణేష్ శోభాయాత్రకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో వాడవాడలా వెలిసిన బొజ్జ గణపయ్యలు నిమజ్జనానికి సాగర తీరానికి తరలిరానున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వినాయక  విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. సెప్టెంబరు 9,10 రోజుల్లో  హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రహదారులు మూతపడనున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూటక్ పల్లి ఐడీఎల్ చెరువులో  వినాయక నిమజ్జనాలు జరగనుండటంతో IDL ట్యాంక్ వద్దకు సందర్శకుల వాహనాలకు ఎంట్రీ లేదు. కూకట్‌పల్లి  వై  జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు... JNTU, ఫోరమ్ మాల్ రోడ్డు మీదుగా వెళ్లాలి. హైటెక్ సిటీ, మాదాపూర్ నుండి కైతలాపూర్ మీదుగా కూకట్‌పల్లి 'వై' జంక్షన్‌కు వెళ్లే వాహనాలను రెయిన్‌బో విస్టా - మూసాపేట్ రోడ్డులోకి మళ్లించారు. ఆల్వాల్‌ హస్మత్‌పేట్ చెరువులో వినాయక నిమజ్జనాల కోసం ఆ రూట్ లో  సాధార‌ణ వాహ‌నాలను అనుమతి లేదు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి, ఇతర కాలనీల నుంచి గణేష్ విగ్రహాలను తీసుకువెళ్ళే వాహనాలు అంజయ్యనగర్ మీదుగా హస్మత్‌పేటకు రావాలని  పోలీసులు సూచించారు. నిమజ్జనం తర్వాత పాత బోయిన్‌పల్లి, మసీదు రోడ్డు, హరిజన బస్తీ మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. సూరారం కట్టమైసమ్మ ట్యాంక్ లో వినాయక నిమజ్జనాలు ఉండటంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 


బాలానగర్‌, జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను.. బౌరంపేట, గండిమైసమ్మ సమీపంలోని సూరారం మీదుగా మళ్లిస్తారు.  గండిమైసమ్మ, బాచుపల్లి నుంచి జీడిమెట్ల, బాలానగర్‌ వైపు వెళ్లే వాహనాలు బహదూర్‌పల్లి జంక్షన్‌ వద్ద ఎడమవైపు తిరిగి.. దూలపల్లి జంక్షన్‌ మీదుగా వెళ్లాలి. దుర్గం చెరువులో నిమజ్జనాల కోసం మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్, సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లై ఓవర్‌, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం 45 ఫ్లై ఓవర్‌ పై వినాయక విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలను అనుమతించరు. దుర్గం చెరువు వంతెన, బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్, మల్కంచెరువు ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్, షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పైనా వాహనాలను అనుమ‌తించ‌రు. 


సంగారెడ్డి, పటాన్‌చెరు, BHEL నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్ సిటీ వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలు అనుమతించరు. BHEL X రోడ్డు వద్ద 'U-టర్న్ తీసుకొని లింగంపల్లి, HCU, గచ్చిబౌలి, టోలిచౌకి వైపు వెళ్లాల్సి ఉంటుంది. BHEL, చందానగర్, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వైపు వచ్చే అన్ని భారీ వాహనాలు మియాపూర్ X రోడ్డు వద్ద మళ్లిస్తారు. ఎడమవైపుకు వెళ్లి బాచుపల్లి, దుండిగల్ రహదారి మీదుగా వెళ్లాలి. గచ్చిబౌలి, పటాన్‌చెరు నుంచి అరామ్‌ఘర్, అత్తాపూర్ వైపు వచ్చే హెవీ గూడ్స్ వాహనాలు హిమాయత్ సాగర్  వద్ద దిగకూడదు. అలాగే ముందుకు వెళ్లి.. ORR శంషాబాద్ వద్ద దిగాలని పోలీసులు సూచించారు. 


Also Read: Chiranjeevi - Pawan Kalyan: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌.. అభిమానులకు పండగే ఇగ!


Also Read:  AP CABINET: కేబినేట్ లో మార్పుల దిశగా సీఎం జగన్.. వేటు పడే మంత్రులు వీళ్లేనా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి