Gang Rape: కామాంధుల దాహానికి మహిళలు బలైపోతున్నారు. ఈ మానవ మృగాలు... చిన్నారుల. వృద్ధులు అని చూడకుండా తమ పశువాంఛను తీర్చుకుంటున్నారు. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు..మానవత్వం మరచిపోయి మరీ అఘాయిత్యాల(Rape)కు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్‌(Nizamabad)లో నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజామాబాద్‌లో నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారాని(gang rape in nizamabad)కి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలి(Victim)ని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల(accused) కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత లేకపోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. 


Also Read: Disha Encounter-Sajjanar: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి