Bandi Sanjay: తెలంగాణలో కమలనాథులు స్పీడ్‌ పెంచారు. టీఆర్‌ఎస్‌ సర్కార్ టార్గెట్‌గా విమర్శలు సంధిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. త్వరలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు రాష్ట్రానికి రాబోతున్నారు. హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఈక్రమంలో సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. తమ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయడానికి సీఎంవోలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలే పట్టించుకోవడం లేదని..బీజేపీ ఎలా ఆలోచిస్తుందన్నారు. పులి వస్తే జింక పారిపోయినట్లు కేసీఆర్ తీరు ఉందని మండిపడ్డారు.


వచ్చే నెల 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగసభను తలపెట్టింది. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చరిత్రలో నిలిచేలా సభను సక్సెస్ చేస్తామన్నారు. తెలంగాణలో పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సభకు 10 గంటల మందిని తరలిస్తామన్నారు.


Also read: Tirumla Temple: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..రేపే అందుబాటులోకి ఆర్జిత సేవా టికెట్లు..!


Also read:India vs England: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..టెస్ట్‌ మ్యాచ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.