Godavari Floods: గోదావరి మరోసారి వరదతో పోటెత్తుతోంది. జూలై నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరికి ఇప్పుడు రెండవసారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద అప్పుడే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుసగా రెండవ నెలలో రెండవసారి గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది. జూలైలో కనీవినీ ఎరుగని వరదతో విలయం సృష్టించిన గోదావరి నది శాంతించింది. ఓ దశలో భద్రాచలం వద్ద గోదావరి నది 71 అడుగులు దాటి ప్రవహించింది.  గోదావరి నదీ చరిత్రలో అతిపెద్ద వరదగా 1986 వరదను చెప్పుకుంటారు. అప్పట్లో భద్రాచలం వద్ద 75.6 అడుగుల వద్ద వరద ప్రవహించింది. రెండవ అతిపెద్ద వరద 2006లో. తిరిగి 2022 జూలై నెల 16వ తేదీన నమోదైంది. ఆ రోజు 71.30 అడుగుల వద్ద ప్రవహించిన వరద గోదావరిలో..24.43 లక్షల క్యూసెక్కులు నీరు ప్రవహించింది. 


ఆ తరువాత జూలై నెలాఖరుకు గోదావరి వరద నెమ్మదిగా శాంతించింది. పునరావాస కేంద్రాల్నించి ఇంకా జనం పూర్తిగా తమ తమ లంకలకు, ఊర్లకు చేరకుండానే గోదావరి వరుసగా రెండవసారి పోటెత్తింది. భద్రాచలం వద్ద క్రమంగా ఒకటి, రెండు ప్రమాద హెచ్చరికల్ని దాటేసింది. కాస్సేపటి క్రితం మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది 53 అడుగులకు చేరుకుంది. 14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. రాత్రికి 56 అడుగులకు చేరవచ్చని అంచనా. 


గోదావరి వరదతో వారం రోజుల్నించి ముంపు మండలాలు మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు స్థంభించాయి. అటు భద్రాచలం నుంచి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు భారీ వాహనాలను నిలిపివేశారు. 


Also read: Munugode: బ్రేకింగ్.. మునుగోడులో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎంపీపీ సహా కీలక నేతలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook