Godavari Water Level: భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
Bhadrachalam: భారీ వర్షాలు, ఎగువ నుంచి వరద ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వది గోదారమ్మ ఉరకలేస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటింది.
Godavari Water Level at Bhadrachalam: గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. వరద నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద ఉదయం 7 గంటలకు గోదావరి నీటిమట్టం 50.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటిమట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా కాలనీల్లో వరదనీరు చేరడంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. కిన్నెరసాని రిజర్వాయర్ వరద పెరగడంతో నాగారం వద్ద భారీ వాహనాల రాకపోకలను ఆపేశారు.
నిలిచిపోయిన రాకపోకలు..
భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్ లో రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో మహబూబాబాద్ నుంచి కేసముద్రం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు వద్ద పాకాల వాగు ఉగ్రరూపం దాల్చడంతో గూడూరు నుంచి నెక్కొండ మధ్య రాకపోకలు జరగట్లేదు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లె జలదిగ్భందంలో చిక్కుకుంది.
హైదరాబాద్ లో ఆగని వాన..
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్ లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బల్దియా యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు సహాయక బృందాలను రంగంలోకి దించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: Heavy Rains Impact: భారీ వర్షాల ప్రభావం, ములుగు అడవుల్లో చిక్కుకున్న 82 మంది పర్యాటకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook